బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఈనెల 3న బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ కన్నడ నటి రన్యారావు కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డీఆర్ఐ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా రూ.12 కోట్లకుపైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమె ఇంట్లో సోదాలు చేయగా రూ.3 కోట్ల విలువైన ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Bhargavi : యూట్యూబ్ ఛానల్స్ థంబ్‌నెయిల్‌పై మండిపడిన నటి భార్గవి
ఇక ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న అధికారులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర అధికారుల బృందం ఎయిర్‌పోర్టును తనిఖీ చేయగా అత్యంత భద్రతా లోపాన్ని గుర్తించారు. అంతర్జాతీయ విమానాల్లో వచ్చే ప్రయాణికులను తనిఖీ చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. అవేమీ కూడా ఎయిర్‌పోర్టులో లేనట్లుగా గుర్తించారు. ప్రయాణికులు కస్టమ్స్ ప్రాంతంలోకి ప్రవేశించే ముందు డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు (DFMD) ఉండాలి. కానీ అవేమీ లేనట్టుగా అధికారుల బృందం గుర్తించింది. ఇది అతిపెద్ద భద్రతా లోపంగా కనిపెట్టారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: జనసేన కచ్చితంగా తమిళనాడులో ఆడుగుపెడుతుంది!
ఇక ప్రయాణికుల హ్యాండ్ బ్యాగేజీ, బాడీని మెటల్ డిటెక్టర్లు స్కాన్ చేస్తుంటాయి. కానీ అటువంటి పరికరాలు కనిపించలేదని రాష్ట్ర పోలీస్ అధికారి తెలిపారు. అంతేకాకుండా నిఘా వ్యవస్థ కూడా అస్తవ్యస్థంగా ఉన్నట్లుగా కనిపెట్టారు. తనిఖీలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నట్లు గుర్తించారు. మెడల్ డిటెక్టర్లు లేకపోవడంతోనే రన్యారావు సులువుగా ఎటువంటి భద్రతా తనిఖీలు లేకుండా తప్పించుకోగలిగారని పేర్కొన్నారు. ఇక సవతి తండ్రి, సీనియర్ ఐపీఎస్ అధికారి రామచంద్రరావు సూచనల మేరకే.. రన్యారావుకి రక్షణ లభించిందని.. దుబాయ్ నుంచి వచ్చిన ప్రతీసారి ఆమె పోలీస్ ప్రొటోకాల్ సేవలను ఉపయోగించుకుని బయటకు వచ్చేసినట్లు అధికారి తెలిపారు.
వాస్తవానికి పోలీస్ ప్రొటోకాల్ సేవలు.. కేవలం ఎస్పీ, అంతకంటే ఎక్కువ స్థాయి ఐపీఎస్ అధికారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అలాంటిది తండ్రిని అడ్డంపెట్టుకుని రన్యారావు తెలివిగా బయటపడిపోయింది. ఇక రన్యారావు ఉదంతంతో పోలీస్ ప్రొటోకాల్ సేవలను ఉపసంహరించుకోవాలని పోలీస్ శాఖ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Exclusive : స్పిరిట్ లో ప్రభాస్ తో పాటు తమిళ స్టార్ హీరో
ఇక ఈ కేసులో రన్యారావు స్నేహితుడు, తెలుగు నటుడు తరుణ్ రాజును డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడి కలిసి ఈ స్మగ్లింగ్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. పలుమార్లు వీరిద్దరూ దుబాయ్ పర్యటనకు వెళ్లొచ్చారు. మార్చి 3న ఉదయం రన్యారావు, తరుణ్ రాజు దుబాయ్‌కి వెళ్లారు. అయితే తరుణ్ రాజు మరొక ప్రాంతానికి వెళ్తున్నట్లు చెప్పి.. అతడు శంషాబాద్ వచ్చేయగా.. రన్యారావు బెంగళూరు ఎయిర్‌పోర్టులో దిగింది. డీఆర్ఐ అధికారులు అమెను అదుపులోకి తీసుకుని మొబైల్ చెక్ చేయగా.. తరుణ్ రాజు యవ్వారం బయటపడింది. ఇక నాలుగు క్రితం ఆర్కిటెక్ జతిన్ హుక్కేరిని రన్యారావు వివాహం చేసుకుంది. కానీ అతడితో ఎలాంటి సంబంధాలు కొనసాగించలేదు. ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నారు. విడాకులు తీసుకోలేదని రన్యారావు భర్త తెలిపాడు.
ఇది కూడా చదవండి: Canada: ట్రంప్ బెదిరింపులు.. ముందస్తు ఎన్నికలకు కెనడా ప్రధాని పిలుపు