మహారాష్ట్రలో అక్రమంగా తరలిస్తున్న అరుదైన, అన్యదేశ జీవులను అధికారులు సీజ్ చేశారు. జీవులను అక్రమంగా తరలిస్తు్న్నట్లు సమాచారం అందుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు వెంటనే రైడ్ చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు.
రోజుకో కొత్త తరహాలో డ్రగ్స్‌ను తరలిస్తున్నారు స్మగ్లర్లు.. ప్యాసింజర్ విమానాల్లో డ్రగ్స్ తరలిస్తూ వరుసగా దొరికిపోతున్న ఘటనలు చాలా ఉండగా.. ఉప్పుడు.. కార్గోను ఎంచుకున్నారు.. అది కూడా పసిగట్టిన డీఆర్‌ఐ అధికారులు.. ఢిల్లీ అంతర్జాతీయ కార్గోలో భారీగా డ్రగ్స్ పట్టివేశారు.. రూ.434 కోట్ల విలువ చేసే హెరాయిన్ సీజ్ చేశారు డీఆర్‌ఐ అధికారులు.. ఉగాండా నుండి ఢిల్లీ వచ్చిన ఓ భారీ పార్శిల్‌లో హెరాయిన్‌ను గుర్తించారు. తెల్లటి హెరాయిన్‌ను ట్రాలీ బ్యాగ్‌ల కింద దాచి తరలించే ప్రయత్నం…
ఎంత నిఘా పెట్టినా.. కఠిన చర్యలు తీసుకుంటున్నా.. డ్రగ్స్ దందా కొనసాగుతుందనేది ఓపెన్ సీక్రెట్.. ఎందుకంటే.. ఎప్పకప్పుడు భారీ స్థాయిలో డ్రగ్స్ దొరుకుతూనే ఉన్నాయి.. ఇక, ఇవాళ సినీ ఫక్కీలో ఓ వ్యక్తి కడుపు డ్రగ్స్ దాచి తరలిస్తున్నాడు.. ఆ వ్యక్తికి ఆపరేషన్ చేసి కొకైన్ క్యాప్సూల్స్ స్వాధీనం చేసుకున్న ఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కలకలం రేపింది. రూ.12 కోట్ల విలువైన 1,157 గ్రాముల కొకైన్‌ను డీఆర్‌ఐ అధికారులు సీజ్ చేశారు. సౌతాఫ్రికా జోహన్నెస్‌బర్గ్ ప్రయాణికుడు అనుమానాస్పదంగా…
దేశంలో నిరుద్యోగం, కరోనా కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, ధరల పెరుగుదల ఎలా వున్నా.. యువతను మత్తులో దించేందుకు ముఠాలు నిరంతరం పనిచేస్తున్నాయి. దేశాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ దందా నానాటికీ పెరిగిపోతోంది. ఎక్కడ అవకాశం వుంటే అక్కడ డ్రగ్స్ రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. ఇప్పటికే భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు పట్టుబడిన గుజరాత్‌లో తాజాగా మరోమారు భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. గుజరాత్‌లో గురువారం నాడు 256 కిలోల హెరాయిన్‌ను నార్కోటిక్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ…
హైదరాబాద్‌లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.. టాంజానియా దేశస్తుడి దగ్గర రూ.20 కోట్ల విలువచేసే హెరాయిన్ గుర్తించారు.. హెరాయిన్‌ను ట్రాలీ బ్యాగ్ కింద భాగంలో దాచి తరలిస్తున్న జాన్ వియమ్స్ అనే వ్యక్తి నుంచి 3 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు డీఆర్‌ఐ అధికారులు… కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.. దోహా నుంచి హైదరాబాద్‌కు హెరాయిన్ తీసుకొచ్చిన జాన్… ఆస్ట్రేలియాకు సరఫరా చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. వారం రోజుల క్రితం…