బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యా రావు భర్త జతిన్ హుక్కేరి అరెస్టు నుండి మినహాయింపు కోరాడు. ఈ మేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో అతనికి కర్ణాటక హైకోర్టు గత మంగళవారం ఉపశమనం ఇచ్చింది. హైకోర్టు తదుపరి విచారణ జరిగే వరకు జతిన్ పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. కాగా.. జతిన్ హుక్కేరి న్యాయవాది ప్రభులింగ నవాద్గి కోర్టులో తన క్లయింట్ వాదనను వినిపించారు. నవంబర్‌లో రన్యా రావుతో వివాహం చేసుకున్న జతిన్.. డిసెంబర్ నుండి విడివిడిగా జీవించడం ప్రారంభిచారని న్యాయవాది తెలిపారు. కొన్ని సమస్యల కారణంగా ఇద్దరూ విడిగా జీవించాలనే నిర్ణయం తీసుకున్నట్లు న్యాయవాది ప్రభులింగ నవాద్గి కోర్టుకు చెప్పారు.
Read Also: KTR- Harish Rao: డీలిమిటేషన్పై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు..
ఇదిలా ఉండగా.. రన్యా రావు బెయిల్ పిటిషన్ పై సెషన్స్ కోర్టులో విచారణ మార్చి 19కు వాయిదా పడింది. కోర్టు, DRI న్యాయవాదికి అభ్యంతరాలు దాఖలు చేయాలని ఆదేశించింది. అభ్యంతరాలు దాఖలు చేసిన తర్వాత తదుపరి చర్యలు కొనసాగుతాయని కోర్టు తెలిపింది. కాగా.. మార్చి 3న కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు రన్యా రావు నుంచి రూ.12.56 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం.. ఆమె నివాసంలో రూ.2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2.67 కోట్ల విలువైన భారతీయ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాధమిక ఆధారాలతో రన్యా రావును పోలీసులు అరెస్టు చేశారు.
Read Also: IPL 2025 JioHotstar: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. అలాచేస్తే ఉచితంగా జియోహాట్‌స్టార్
అనంతరం.. రన్యా రావు కూడా డిఆర్ఐ అధికారులపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. అధికారులు తనను కొట్టారని.. ఖాళీగా ఉన్న, ముందే రాసిన కాగితాలపై బలవంతంగా సంతకం చేయించారని తెలిపింది. బెంగళూరులోని డిఆర్‌ఐ అదనపు డైరెక్టర్ జనరల్‌కు రాసిన లేఖలో తనపై తప్పుడు కేసు మోపారని రాన్యా పేర్కొన్నారు. “ఈ కేసులో నేను నిర్దోషిని అని చెప్పడానికి మీరు నాకు అనుమతించలేదు” అని పేర్కొంది. తనను కస్టడీలోకి తీసుకున్నప్పటి నుంచి కోర్టులో హాజరుపరిచే వరకు 10 నుంచి 15 సార్లు చెంపదెబ్బ కొట్టారని నటి ఆరోపించింది. కాగా.. ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో రన్యా రావు తనకు జరుగుతున్న అన్యాయాన్ని బహిర్గతం చేసేందుకు DRI అధికారులు, ఇతర ప్రభుత్వ అధికారులపై తీవ్రమైన ఆరోపణలు చేసింది.