బంగారం అక్రమ రవాణా కేసులో నిందితురాలిగా ఉన్న కన్నడ నటి రన్యా రావుకు మరో షాక్ తగిలింది. ఆమె బెయిల్ పిటిషన్‌ను బెంగళూరులోని సెషన్స్ కోర్టు తిరస్కరించింది. కేసు తీవ్రత, ఆమెకు ఉన్న పలుకుబడిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. ఆమె బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. రన్యా రావు కేసులో అంతర్జాతీయ సంబంధాలు ఉన్నాయని, కస్టమ్స్ నిబంధనలను ఉల్లంఘించారని, రన్యారావుకు బెయిల్ లభిస్తే సాక్ష్యాలను నాశనం చేయడానికి, దర్యాప్తును అడ్డుకోవడానికి దారితీయవచ్చని కోర్టు పేర్కొంది. కాగా.. ఆమె బెయిల్‌ను తిరస్కరించడం ఇది మూడోసారి.. గతంలో రెండుసార్లు బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చింది. రన్యా రావును మార్చి 3న బెంగళూరు విమానాశ్రయంలో 14.2 కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా తరలిస్తుండగా డీఆర్ఐ అధికారులకు పట్టుబడింది. ఆమె వద్ద నుంచి పట్టుబడిన బంగారం విలువ రూ.12.56 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
Read Also: Jr NTR: ఆ క్రేజ్ ఏంటి సార్.. పిచ్చోళ్ళు అయిపోతున్నారు అక్కడ!
అనంతరం.. రన్యా రావు నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించగా.. రూ.2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2.67 కోట్ల విలువైన భారతీయ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. కాగా.. రన్యా స్వయంగా హవాలా మార్గాలను ఉపయోగించి బంగారం కొనుగోలు చేసినట్లు ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది. దీంతో.. రన్యా రావుపై న్యాయ విచారణ ప్రారంభించాలని అధికారులు నోటీసు జారీ చేశారు. మరోవైపు.. ఈ కేసులో రన్యా రావుకు అక్రమంగా బంగారాన్ని తరలించడంలో సహాయం చేసినట్లు వ్యాపారవేత్త సాహిల్ జైన్‌పై ఆరోపణలు ఉన్నాయి. దీంతో.. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) గురువారం సాహిల్ జైన్‌ను అరెస్టు చేసింది. సాహిల్ జైన్ బంగారాన్ని తరలించడంలో.. దాన్ని అమ్మి వచ్చిన డబ్బును పంపిణీ చేయడంలో సహాయం చేసినట్లు వర్గాలు పేర్కొన్నాయి.
Read Also: Prabhas : హైదరాబాద్ వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. నిజమెంత..?
ఈ కేసులో రన్యా రావు, హోటల్ వ్యాపారి తరుణ్ రాజులను ఇప్పటికే అరెస్టు చేశారు. రన్యా సహచరుడు తరుణ్ రాజ్ దుబాయ్‌కు 26వ సార్లు కలిసి వెళ్లారు. ఈ కేసులో అతను రెండవ నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం, అతని బెయిల్ పిటిషన్‌పై కోర్టు మార్చి 29 నిర్ణయం తీసుకోనుంది. ఈ కేసులో ఇప్పటివరకు రన్యా రావుతో సహా మొత్తం ముగ్గురు వ్యక్తులను పోలీసుల అరెస్ట్ చేశారు.