గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో సంచలనంగా మారిన విషయం ఏదైనా ఉందంటే అది నటి రన్యారావ్ బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోవడమే. ఈమె వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. గోల్డ్ స్మగ్లింగ్ కు పాల్పడుతున్న రన్యారావును డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటుంది. తాజాగా మరో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. రన్యారావుపై డీఆర్ఐ అధికారులకు ఫిర్యాదు చేసింది ఆమె భర్తేనని తెలిసింది. పెళ్లైన రెండు నెలల నుంచే ఆమె విదేశాలల్లో పర్యటిస్తుందని టాక్ వినిపిస్తోంది. అప్పటి నుంచే ఇంట్లో గొడవలు మొదలైనట్లు సమాచారం. మొదట్లో ఆమె రష్యాకు, ఆ తర్వాత దుబాయ్ కి వెళ్లేదని.. ఈ నేపథ్యంలో భర్త సమాచారంతోనే నిఘా పెట్టిన డీఆర్ఐ చివరకు ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.
Also Read:Medak District: ఉమ్మడి మెదక్ జిల్లాలో అంతుచిక్కని వ్యాధితో కోళ్ల మృత్యువాత
బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో రన్యారావును తనిఖీ చేయగా రూ. 12 కోట్లకు పైగా విలువైన పసిడిని ఆమె దగ్గర్నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించగా కోట్ల రూపాయల ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. గత సంవత్సరంలో రన్యారావు దాదాపు 30సార్లు దుబాయ్ కి వెళ్లొచ్చినట్లు అధికారులు గుర్తించారు. కేవలం 15 రోజుల వ్యవధిలోనే 4 సార్లు వెళ్లినట్లు తెలిసింది. ప్రతి ట్రిప్పులోను బంగారాన్ని అక్రమంగా రవాణా చేసిందని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ కేసులో రన్యారవు ఫ్రెండ్, అట్రియా హోటల్ యజమాని మనవడు తరుణ్ రాజును బెంగళూరులో అధికారులు అరెస్టు చేశారు.