Godavari Flood: తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నది మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర నీటి మట్టం క్రమంగా పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అయితే, నీటిమట్టం 11.75 అడుగులకు చేరుకోవడంతో వెంటనే మొదటి ప్రమాద హెచ్చరిక ప్రకటించారు.
Dowleswaram Barrage: గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పడిన భారీ వర్షాలతో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కీలకమైన కృష్ణ, గోదావరి నదులకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. అయితే, ప్రస్తుతం కృష్ణమ్మ కొంచెం శాంతించినా.. గోదావరిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతూనే ఉంది.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి క్రమేపీ పెరుగుతోంది.
గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు నిండుకుండలా మారుతున్నాయి. ముఖ్యంగా తూగో జిల్లాలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర క్రమేపి గోదావరి వరద నీటిమట్టం పెరిగిపోతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి వరద ఉధృతి ఉంది.
గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద ఉద్ధృతి బాగా పెరుగుతోంది. గోదావరి వరద ఉద్ధృతితో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 13.75 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. గంటకు ఒక పాయింట్ వంతున తగ్గుతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువగా కొనసాగిన గోదావరి వరద ఉధృతి స్వల్పంగా తగ్గుతుంది. బ్యారేజీ వద్ద ప్రస్తుత నీటిమట్టం 11 పాయింట్ 5 అడుగులు వద్ద వరద ప్రవాహం కొనసాగుతుంది. బ్యారేజీకి సంబంధించిన 175 గేట్లను 5 మీటర్ల ఎత్తు వరకు ఎత్తి ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరదనీటిని…
ఎగువ నుంచి భారీ వరదలతో గోదావరి మహోగ్రరూపం దాల్చింది.. లంక గ్రామాలను గోదావరి ముంచెత్తుతోంది.. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 15.20 అడుగులకు చేరింది నీటిమట్టం.. దీంతో, రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు అధికారులు.. బ్యారేజీ నుండి 15 లక్షల 21 వేల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.. అయితే, గడిచిన 24 గంటలూగా గోదావరిలో అదే పరిస్థితి కొనసాగుతోంది.. అయితే, ధవళేశ్వరం దగ్గర 11.75 అడుగులు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ…