తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. గంటకు ఒక పాయింట్ వంతున తగ్గుతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువగా కొనసాగిన గోదావరి వరద ఉధృతి స్వల్పంగా తగ్గుతుంది. బ్యారేజీ వద్ద ప్రస్తుత నీటిమట్టం 11 పాయింట్ 5 అడుగులు వద్ద వరద ప్రవాహం కొనసాగుతుంది. బ్యారేజీకి సంబంధించిన 175 గేట్లను 5 మీటర్ల ఎత్తు వరకు ఎత్తి ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ నుండి 9 లక్షల 30 వేల క్యూసెక్కులు వరదనీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గత రాత్రి మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువగా నీటిమట్టం 11 పాయింట్ 7 అడుగులకు చేరి సుమారు 5 గంటల పాటు నిలకడగా వరద ఉధృతి కొనసాగింది. అనంతరం ఈ ఉదయం 6 గంటల నుండి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దీనితో గోదావరి నది పరివాహక ప్రాంతాల ప్రజలు ఊపీరిపీల్చుకుంటున్నారు. గోదావరి వరద ఉధృతి తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ అధికారులు హెచ్చరిస్తున్నారు
Also Read : Krithi Shetty: చినుకునైనా కాకపోతిని నిన్ను తాకగా.. వర్షంలో బుల్లి డ్రెస్ లో బేబమ్మ
ఇదిలా ఉంటే.. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద క్రమంగా వరద పెరుగుతోంది. సముద్రంలోకి 11,025 క్యూసెక్కుల విడుదల చేస్తున్నారు. అధికారుల.. కాలువలకు 5,513 క్యూసెక్కుల విడుదల చేయగా.. మొత్తం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 16,538 క్యూసెక్కులు.. బ్యారేజీ నీటిమట్టం 12 అడుగులుగా ఉంది. 15 గేట్లు ఒక అడుగుమేర అధికారులు ఎత్తారు. సాయంత్రానికి వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నానికి ప్రకాశం బ్యారేజీకి పట్టిసీమ ఔట్ ఫ్లో చేరనుంది. మున్నేరు వద్ద కూడా వరద ప్రవాహం తగ్గుతూ వస్తోంది. పులిచింతల వద్ద ఔట్ ఫ్లో లేకపోవడంతో ప్రకాశం బ్యారేజీ కి వరద సాధారణంగా ఉంది.
Also Read : North Korea: మళ్లీ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా.. కొనసాగుతున్న ఉద్రిక్తతలు