Dowleswaram Barrage: గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పడిన భారీ వర్షాలతో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కీలకమైన కృష్ణ, గోదావరి నదులకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. అయితే, ప్రస్తుతం కృష్ణమ్మ కొంచెం శాంతించినా.. గోదావరిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర గోదావరి మొదటి ప్రమాద హెచ్చరికను మించి ప్రవహిస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీటిమట్టం క్రమంగా పెరుగిపోతుంది.
Read Also: Central Ministers: నేడు ఖమ్మం వరద ప్రాంతాల్లో కేంద్ర మంత్రుల ఏరియల్ సర్వే ..
అయితే, ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర నీటిమట్టం 12 అడుగులకు చేరిపోయింది. అలాగే బ్యారేజ్ నుంచి 11 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి అధికారులు రిలీజ్ చేస్తున్నారు. బ్యారేజీకి సంబంధించిన మొత్తం 175 గేట్లను ఎత్తి వేశారు. అయితే ప్రస్తుతం గోదావరి నదిపై ఎగువన ఉన్న ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు క్రమేపి పెరుగుతున్నాయి. దీంతో ధవళేశ్వరం బ్యారేజీకి మరింత వరదం వస్తుండటంతో.. వరద మరింత పెరిగే ఛాన్స్ ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం గంటకు ఒక పాయింట్ వంతున ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం పెరుగుతుంది.