Double Bedroom Scam: సంగారెడ్డి జిల్లాలో కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తానని పేదలను నమ్మించి ఓ వ్యక్తి మోసం చేశాడు. అమీన్ పూర్ మండలం కిష్టారెడ్డిపేటకు చెందిన బీహెచ్ఈఎల్ ఉద్యోగి ప్రసన్న కుమార్ పై బాధితులు ఆరోపణలు చేస్తున్నారు.
Double Fraud : సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు పేద, మధ్య తరగతి వర్గాల వారు నానా తంటాలు పడుతున్నారు. అదీ హైదరాబాద్ లాంటి నగరంలో అయితే వారి కష్టాలు వర్ణనాతీతంగా ఉంటాయి. కనీసం ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్ రూమ్‌తోనైనా తమ కల సాకారం అవుతుందని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ వాళ్లను ట్రార్గెట్ చేస్తూ కొంత మంది బ్రోకర్లు.. అందిన కాడికి దోచుకుంటున్నారు. హైదరాబాద్ మేడిపల్లిలో అదే జరిగింది. సొంతింటి కోసం కలలు కంటున్న…
Double Bedroom Scam Exposed in Kuthbullapur: ప్రభుత్వ పథకం ‘డబుల్ బెడ్‌రూమ్’ హౌసింగ్ పేరున రాజకీయ నాయకుల అనుచరులు, అధికారులు చేసిన దోపిడీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నేను పలానా ఎమ్మెల్యే పీఏను, నాకు ఆ మంత్రి బాగా తెలుసు, నేను ప్రభుత్వ ఆఫీసులోనే పనిచేస్తాను అని చెప్పి.. డబుల్ బెడ్‌రూమ్ ఇప్పించే బాధ్యత తమది అంటూ పేద ప్రజల నుంచి లక్షల్లో వసూళ్లకు పాల్పడిన వారిని ఇప్పటికే చాలా మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.…
డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు.. జస్ట్ 2 లక్షల రూపాయలు మాత్రమే..!! ఈ ఆఫర్ మీకు కూడా టెంప్టింగ్‌గా అనిపిస్తోంది కదూ..!! అవును మరి అలాంటిదే బంపర్ ఆఫర్..!! ఇలా నమ్మించే దాదాపు 100 మందిని బురిడీ కొట్టించారు నలుగురు కేటుగాళ్లు. ఏకంగా కోటి రూపాయలు కొట్టేసి నకిలీ పట్టాలు చేతిలో పెట్టారు. పోలీసులు పట్టుకోవడంతో ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతున్నారు. సొంత ఇల్లు ఎవరికైనా ఓ కల. సొంత ఇల్లు ఉండాలి.. ఇది ఎవరికైనా ఓ కల..డబుల్ బెడ్‌రూమ్…