Donald Trump: రష్యా అధినేత పుతిన్ పై అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు. సోమవారం నాడు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. రష్యా పెద్ద చిక్కుల్లో పడబోతుందని చెప్పుకొచ్చాడు.
Donald Trump: అమెరికా గడ్డపై జన్మించిన ప్రతి చిన్నారికి పౌరసత్వం లభించే చట్టాన్ని నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేశారు. ఇప్పటివరకు ఉన్న విధానం ప్రకారం, అమెరికాలో జన్మించిన ప్రతి చిన్నారికి సహజంగా పౌరసత్వ హక్కు లభించేది. ఇది 14వ రాజ్యాంగ సవరణ ద్వారా అమలులోకి వచ్చింది. కానీ, తాజాగా ట్రంప్ ఈ చట్టాన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ (Executive Order) ద్వారా రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘‘ వలసదారుల పిల్లలకు పౌరసత్వాన్ని మా…
Joe Biden: అమెరికా అధ్యక్షుడి పదవీ బాధ్యతల నుంచి జో బైడెన్ తప్పుకున్నారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను వీడింది కేవలం కార్యాలయాన్నే, పోరాటాన్ని కాదు అన్నారు.
Vivek Ramaswamy: అమెరికా 47వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కీలక పరిణామం జరిగింది. భారత అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి కీలక ప్రకటన చేశారు. ట్రంప్ కార్యవర్గంలో కీలకమైన డోజ్ (డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ) బాధ్యతల నుంచి తాను తప్పుకుంటున్నట్టు వెల్లడించారు.
PM Modi: వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్ రోటుండాలో జరిగిన కార్యక్రమంలో అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్‌నకు భారత ప్రధాని నరేంద్ర మోడీ సహా ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణస్వీకారం చేశారు. డొనాల్డ్ ట్రంప్ కంటే ముందుగా జేడీ వాన్స్ ప్రమాణం చేశారు. జేడీ వాన్స్ చేత అమెరికా ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయించారు.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారు. అగ్ర రాజ్యానికి 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం చేశారు. ట్రంప్ చేత అమెరికా ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయించారు.
BitCoin : అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు బిట్‌కాయిన్ కొత్త రికార్డులను నెలకొల్పింది. ఈ ఉదయం బిట్‌కాయిన్ ధర 109,241డాలర్లకి చేరుకుంది.
Indian Community: అమెరికా 47వ అధ్యక్షుడిగా ఈరోజు (జనవరి 20) ప్రమాణ స్వీకారం చేయనున్న డొనాల్డ్ ట్రంప్‌కు భారతీయ సంఘం సభ్యులు అభినందనలు తెలియజేస్తున్నారు. కొత్త పరిపాలనలో అమెరికా- భారత్ సంబంధాలు మరింత అభివృద్ధి చెందుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.