ఫెడరల్ డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్ సిబ్బంది అందరికీ లేఆఫ్‌లు ఇవ్వడానికి ట్రంప్ కార్యవర్గం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వారందరినీ సెలవులో ఉంచాలని జీవో జారీ చేసింది. ఇక, అమెరికా ఫెడరల్ ప్రభుత్వానికి చెందిన డైవర్సిటీ, ఇన్‌క్లూజన్ ప్రోగ్రామ్‌లను నిర్వీర్యం చేయడానికి ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం పెట్టారు.
America- India: అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొన్నారు.
అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. తనకు రెండు వైపుల వాదనలూ నచ్చాయి.. సమర్థవంతమైన ప్రజలు అమెరికాలోకి రావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. కేవలం ఇంజనీర్ల గురించి మాత్రమే కాదు.. అన్ని స్థాయిల వ్యక్తుల గురించి ఈ మాట చెబుతున్నాను అన్నారు.
Greenland: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించారు. వచ్చీరావడంతోనే ఏడాపెడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేస్తున్నాడు. తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. ఇందులో భాగంగానే అక్రమ వలసల బహిష్కరణ, బర్త్ రైట్ పౌరసత్వం వంటి కీలక ఉత్తర్వులపై సంతకాలు చేశారు.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. వచ్చి రావడంతోనే అక్రమ వలసదారుల బహిష్కరణ, జన్మత: పౌరసత్వం(బర్త్‌రైట్ సిటిజన్‌షిప్)పై పని మొదలుపెట్టారు. ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో ఈ రెండు హామీలపై దృష్టిసారించిన సంగతి తెలిసిందే. అధికారంలోకి రాగానే వీటిపై ‘‘ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్’’ పాస్ చేశాడు. ఇదిలా ఉంటే,
Trump Tower: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. తన తొలిరోజు రికార్డ్ స్థాయిలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేస్తున్నారు. రాబోయే కాలంలో అమెరికా-ఇండియాల మధ్య బంధం మరింత బలపడుతుందని ఇరు దేశాలు భావిస్తున్నాయి. మరోవైపు ట్రంప్ భారత్‌కి సన్నిహితుడనే పేరుంది. మోడీ-ట్రంప్ మధ్య ఉన్న స్నేహం ఇరు దేశాల కీలక ఒప్పందాలకు కారణమవుతుందని అంతర్జాతీయ సంబంధాల విశ్లేషకులు భావిస్తున్నారు.
Donald Trump: అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికార బాధ్యతలు తీసుకున్నారు. వచ్చీ రాగానే ఆయన గత పాలకుడు జో బైడెన్ నిర్ణయాలను రద్దు చేస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. ఇదిలా ఉంటే, తన ఎన్నికల హామీల్లో కీలకమైన ‘‘బర్త్ రైట్ పౌరసత్వం’’ని రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశారు. దీంతో ముఖ్యంగా విదేశాల నుంచి అమెరికా వెళ్లిన వారికి భారీ షాక్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా భారతీయ వలసదారులకు ఈ పరిణామం మింగుడుపడటం…
America: అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బ్రిక్స్ దేశాలపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా డాలర్‌కు నష్టం కలిగించేలా డీ-డాలరైజేషన్ ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
తనదైన మార్క్ పాలనను మొదలెట్టిన ట్రంప్.. పౌరసత్వంపై కొత్త ఉత్తర్వులు! అమెరికా గడ్డపై జన్మించిన ప్రతి చిన్నారికి పౌరసత్వం లభించే చట్టాన్ని నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేశారు. ఇప్పటివరకు ఉన్న విధానం ప్రకారం, అమెరికాలో జన్మించిన ప్రతి చిన్నారికి సహజంగా పౌరసత్వ హక్కు లభించేది. ఇది 14వ రాజ్యాంగ సవరణ ద్వారా అమలులోకి వచ్చింది. కానీ, తాజాగా ట్రంప్ ఈ చట్టాన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ (Executive Order) ద్వారా రద్దు చేస్తూ కీలక నిర్ణయం…
Trump Diet Coke Button: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఓవల్ ఆఫీసులోని ఆయన టేబుల్ పై స్పెషల్ బటన్ ను సిబ్బంది ఏర్పాటు చేశారు. ట్రంప్ ఈ బటన్ నొక్కగానే డైట్ కోక్ ను సిబ్బంది తీసుకొచ్చి ఇవ్వనున్నారు.