Donald Trump: ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన రెండు దేశాలకు కీలకంగా మారాయి. పలు రంగాల్లో ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యంగా రెండు దేశాల మధ్య వాణిజ్యంపై ట్రంప్, మోడీ చర్చించారు. చర్చల అనంతరం ఇరువురు నేతలు జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధాని మోడీతో భేటీకి ముందు ట్రంప్ ‘‘పరస్పర సుంకాల’’పై ప్రకటన చేశాడు. మీలో కఠినమైన, మంచి నెగోషియేటర్(సంధానకర్త) ఎవరు అని మీడియా ప్రశ్నించిన నేపథ్యంలో ట్రంప్ సమాధానం ఇచ్చారు. ‘‘ ఆయన (మోడీ) నాకన్నా చాలా కఠినమైన సంధానకర్త. చర్చల్లో కఠినంగా వ్యవహరిస్తారు, ఆయన నా కన్నా చాలా మంచి నెగోషియేటర్, పోటీ కూడా లేదు’’ అని ట్రంప్ అన్నారు.
Read Also: Mobile Addiction: మొబైల్ ఫోన్ పక్కన పెట్టుకొని పడుకుంటే ప్రమాదమా? నిజాలు ఏమిటి?
దీనికి ముందు ట్రంప్ వైట్ హౌజ్‌లో ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికారు. ఇద్దరి మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు సాగాయి. ఇద్దరు నేతలు రెండు దేశాల మద్య వాణిజ్యంలోని అసమానతపై చర్చించారు, రెండు దేశాల మధ్య మెరుగైన ఆర్థిక సహకారం గురించి మాట్లాడారు. రెండు దేశాలు ఇంధనంపై ఒక ముఖ్యమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని, భారతదేశానిక అమెరికా చమురు, సహజవాయువు సరఫరాదారుగా మారబోతుందని ట్రంప్ ప్రకటించారు. ‘‘అమెరికా అణు పరిశ్రమ విప్లవాత్మక అభివృద్ధిలో, భారత మార్కెట్లో అత్యున్నత స్థాయిలో ఉన్న అమెరికా అణు సాంకేతిక ప్రవేశాన్ని సులభతరం చేయడానికి భారత్ తన చట్టాలను సంస్కరిస్తోంది. వారు మన చమురు, గ్యాస్‌ని ఎక్కువగా కొనుగోలు చేయబోతున్నారు. భారత్ అమెరికా కోసం మేము అద్భుతమైన వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోబోతున్నాము’’ అని ట్రంప్ అన్నారు.