Trump vs INDIA: దిగ్గజ ఈవీ కంపెనీ టెస్లా.. భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది. ఇప్పటికే ఈ సంస్థ ఇక్కడ నియామకాలను ఆరంభించింది. షోరూంల ఏర్పాటు కోసం కూడా ప్రయత్నాలు స్టార్ట్ చేయగా.. ఈ పరిణామాలపై తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ నిర్ణయం సరైంది కాదు అని పేర్కొన్నారు. మస్క్ పక్కన ఉండగానే అమెరికా అధ్యక్షుడు ఈ కామెంట్స్ చేయడం గమనార్హం. ఈ ప్రపంచంలోని ప్రతి దేశం మమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తోంది అని డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు.
Read Also: WPL 2025: మరోమారు గెలుపుబాట పట్టిన ఢిల్లీ.. తీరుమారని యూపీ
ఇక, సుంకాలతో మా దగ్గర నుంచి లబ్ధి పొందాలని చూస్తున్నారు అని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇప్పుడు మస్క్ భారత్‌లో టెస్లా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నారు.. ఆయన వరకు అది మంచిదే కావొచ్చు.. కానీ, మస్క్ అలా చేయడం వల్ల అమెరికా తీవ్రంగా నష్టపోతుందన్నారు. అలాగే, గత వారం భారత ప్రధాని మోడీతో భేటీని ట్రంప్ గుర్తు చేసుకున్నారు. ఈ మీటింగ్ లో విద్యుత్ కార్లపై అధిక పన్నుల విషయాన్ని నరేంద్ర మోడీతో ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. ట్యాక్సుల సమస్యను పరిష్కరించుకోవడంతో పాటు వీలైనంత త్వరగా వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి ఇరు దేశాలు కలిసి పని చేసేలా నిర్ణయించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు.
Read Also: Shivangi : అనిల్ రావిపూడి చేతుల మీదుగా ‘శివంగి’ ఫస్ట్ లుక్ రిలీజ్
అయితే, ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తో సమావేశం అయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఈ సంస్థ భారత్‌లో నియామకాల ప్రక్రియను ప్రారంభించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచే విక్రయ కార్యకలాపాలను స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. కానీ, భారత్‌లో ఈవీ కార్ల తయారీపై టెస్లా ఇంకా తుది నిర్ణయం మాత్రం తీసుకోలేదు. తాజాగా, భారత ప్రభుత్వం నూతన ఈవీ పాలసీ విధానాన్ని ఆవిష్కరించింది. కార్ల తయారీ సంస్థలు దేశంలో కనీసం 500 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడంతో ఇక్కడ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే దిగుమతి సుంకాలను 15 శాతానికి తగ్గించేలా ప్రణాళికలు రెడీ చేసింది. ఈ పరిణామాల వేళ అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.