Canada: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కెనడాపై భారీ స్థాయిలో సుంకాలు విధిస్తానని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ రియాక్ట్ అయ్యారు. యూఎస్ టారీఫ్ లు పెంచితే అమెరికన్లకు కూడా ట్రంప్ పన్నుల దెబ్బ తప్పదంటూ ఆమె వార్నింగ్ ఇచ్చారు.
H-1B Visas: మంచి వేతనాలను తీసుకునే అమెరికన్ ఉద్యోగులను తొలగించడానికే హెచ్-1బీ వీసా ఉపయోగపడుతోందని యూఎస్ సెనెటర్ బెర్నీ శాండర్స్ ఆరోపణలు చేశారు. వారి స్థానంలో తక్కువ వేతనాలకే వచ్చే విదేశీ కార్మికులను అధిక సంఖ్యలో కంపెనీలు నియమించుకునే ప్రమాదం ఉందని ఆక్షేపించారు.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునేందుకు రంగం సిద్దమైంది. ఈ నెల 10న ఆయన పదవీస్వీకారం చేయబోతున్నారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో కమలా హారిస్‌పై ట్రంప్ ఘన విజయం సాధించారు. మరోసారి ఆయన అగ్రరాజ్యానికి అధినేత కాబోతున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా యూరోపియన్ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్(ECFR) నిర్వహించిన గ్లోబల్ పోల్‌లో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే డొనాల్డ్ ట్రంప్‌కి భారతీయులే అతిపెద్ద మద్దతుదారులుగా ఉన్నట్లు తేలింది.
Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి గెలిచిన డొనాల్డ్ ట్రంప్ జనవరి 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి బిలియనీర్లు, టెక్ దిగ్గజాలు ఎలాన్‌మస్క్, మార్క్ జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్ హాజరవుతారని పేర్కొన్నారు.
Jai Shankar: అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి విదితమే. వాషింగ్టన్ డీసీలో ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రపంచంలోని పలు దేశాల నేతలు హాజరు కానున్నారు. అయితే, భారతదేశ తరఫున విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పాల్గొననున్నారు. మినిస్టరీ అఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ప్రకటన ప్రకారం, డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ట్రంప్ – వాన్స్ కమిటీ ఆహ్వానం…
Joe Biden: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ చేతిలో కమలా హారిస్ ఓటమిపై ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జో బైడెన్, డెమోక్రటిక్ పార్టీతో ఐక్యత కోసం పోటీలో పాల్గొనకపోవడం వల్ల తాను ట్రంప్‌ను ఓడించడంలో విఫలమైనట్లు తెలియజేశారు. ఒకవేళ నేను పోటీలో నేను ఉంటే ట్రంప్‌ను కచ్చితంగా ఓడించేవాడిని అని జో బైడెన్ నమ్మకంగా పేర్కొన్నారు. అధికారంలో తిరిగి పోటీ చేయకూడదనే నిర్ణయంపై నాకు విచారం లేదు. నేను, కమలా…
Donald Trump: మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ శుక్రవారం అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమయ్యారు. ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసం మార్-ఎ-లాగోలో ఈ మీటింగ్ జరిగినట్లు నివేదికలు వెల్లడించాయి. దీనిపై ఇప్పటి వరకు ఇటు మెటా కానీ, అటు ట్రంప్ వర్గం కాని స్పందించలేదు.
Donald Trump: ఒక నేరస్థుడికి శిక్ష పడిన మొదటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిలిచారు. హుష్ మనీ కేసులో నేరారోపణలు ఎదుర్కొంటున్న ట్రంప్‌కి ఈ రోజు అమెరికా కోర్టు దోషిగా నిర్ధారించింది. అయితే, అతడికి ‘‘షరతులు లేని విడుదల’ శిక్ష విధించబడింది. అంటే, ప్రస్తుతం ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు తన ఆరోపణలకు దోషిగా తేలాడని అర్థం.
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వాషింగ్టన్ నేషనల్ కేథడ్రల్ చర్చిలో జరిగిన ప్రార్థనా కార్యక్రమాల్లో అధ్యక్షుడు బైడెన్ దంపతుల సహా.. కాబోయే అధ్యక్షుడు ట్రంప్ దంపతులు, మాజీ అధ్యక్షుల కుటుంబాలు హాజరయ్యారు.
Donald Trump: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనను కలవాలని అనుకుంటున్నారని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తమ ఇద్దరి మధ్య సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ట్రంప్ గురువారం తెలిపారు. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ప్రారంభమైంది. అయితే, తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పుతానని పలుమార్లు ట్రంప్ అన్నారు.