ట్రంప్‌కు గతంలో వైట్ హౌస్ సలహాదారుడిగా పని చేసిన స్టీవ్ బెనాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాన్ మస్క్‌ను ఓ అక్రమ గ్రహాంతరవాసిగా పేర్కొన్నాడు. వెంటనే అతడ్ని దేశం నుంచి బహిష్కరించాలని కోరారు. అంతేకాదు, మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థను సీజ్ చేయాలని యూఎస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Trump-Musk: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలుపుకి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆర్థికంగా ఎంత సాయం చేశారో అందరికీ తెలిసింది. అయితే, గెలిచిన తర్వాత ట్రంప్ కి అత్యంత సన్నిహితుడిగా మారిన మస్క్ డోజీ ద్వారా ఖర్చులు తగ్గించేందుకు కీలకంగా పని చేశారు. కానీ, ప్రస్తుతం ట్రంప్ తీసుకొస్తున్న బిగ్ బ్యూటిఫుల్ టాక్స్ బిల్ వీరి మధ్య దోస్తాన్ కి బీటలువార్చింది.
“వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు”పై ఎలోన్ మస్క్ తీవ్ర విమర్శలు చేయడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరాశ వ్యక్తం చేశారు. EVలకు ఫెడరల్ కన్స్యూమర్ టాక్స్ క్రెడిట్‌ను దశలవారీగా తొలగించాలనే ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ ప్రణాళిక నుంచి మస్క్ వ్యతిరేకత వచ్చిందని, ఇది టెస్లాను నేరుగా ప్రభావితం చేస్తుందని అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఎలోన్, నేను చాలా మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాము. Also Read:TG Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక…
ట్రంప్ తన ప్రకటనలతో ప్రపంచాన్ని నిరంతరం షాక్ కు గురిచేస్తున్నారు. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న హార్వర్డ్ విశ్వవిద్యాలయ వివాదం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ట్రంప్ హార్వర్డ్‌లో విదేశీ విద్యార్థులకు వీసాలను నిషేధించారు. బుధవారం నాడు వైట్ హౌస్ ఈ సమాచారాన్ని అందించింది. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి విదేశీ విద్యార్థుల వీసాలను పరిమితం చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటనపై సంతకం చేశారని, విద్యా సంస్థతో వివాదం తీవ్రమవుతున్న నేపథ్యంలో వైట్…
US-India Trade Deal: భారత్, అమెరికా మధ్య త్వరలో ‘‘వాణిజ్య ఒప్పందం’’ ఖరారు కావచ్చని యూఎస్ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ తెలిపారు. ఈ వారం న్యూఢిల్లీలో జరిగే భారత్-అమెరికా చర్చల చివరి రౌండ్ సమావేశాలకు ముందు ఈ ప్రకటన వచ్చింది. ‘‘ఇరు దేశాలు కలిసి పనిచేసే స్థలాన్ని కనుగొన్నాము కాబట్టి, త్వరలోనే అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం వస్తుందని మీరు ఆశించాలి’’ అని యుఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరం (యుఎస్ఐఎస్పిఎఫ్) ఎనిమిదవ ఎడిషన్‌లో లుట్నిక్…
US China Trade War: అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ వారం చివరలో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా ప్రెసిడెంట్ జి జిన్‌పింగ్ చర్చిస్తారని వైట్‌హౌజ్ సోమవారం తెలిపింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం విదేశీ ఉక్కు దిగుమతులపై సుంకాలను రెట్టింపు చేసే ప్రణాళికను ప్రకటించారు. ప్రస్తుత 25 శాతం నుంచి సుంకం రేటును 50 శాతానికి పెంచారు. అమెరికన్ ఉక్కు పరిశ్రమను ప్రోత్సహించడమే ఈ సుంకం లక్ష్యం అని ఆయన అన్నారు. పెన్సిల్వేనియాలోని యుఎస్ స్టీల్, మోన్ వ్యాలీ వర్క్స్-ఇర్విన్ ప్లాంట్‌లో మాట్లాడుతూ, సుంకాల పెంపు దేశీయ ఉక్కు ఉత్పత్తిదారులను రక్షించి, అమెరికన్ తయారీని పెంచుతుందని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. Also Read:Operation Shield:…
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రముఖ బిలియనీర్, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ పై ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వంలో వ్యర్థ ఖర్చుల నివారణ కోసం ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) చీఫ్ పదవి నుంచి మస్క్ తప్పుకుంటున్న నేపథ్యంలో ట్రంప్ స్పందించారు. ఇందులో భాగంగా “ఎలాన్ మస్క్ అద్భుతమైన వ్యక్తి. ఇది ఆయన చివరి రోజు అయినా, ఆయన మనతోనే ఉంటారు. ఎల్లప్పుడూ సహాయపడుతూనే ఉంటారు” అని ట్రంప్ అన్నారు.…
Vivek Ramaswamy: భారత సంతతి ఎంటర్ప్రెన్యూర్, అమెరికా అధికార పార్టీ రిపబ్లికన్ నేత వివేక రామస్వామి, ఆయన భార్య జాత్యహంకార వ్యాఖ్యల్ని ఎదుర్కొన్నారు. ఇటీవల, తమ 10వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వివేక్ రామస్వామి, తన భార్య అపూర్వతో కలిసి ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి, ఒక ఎమోషనల్ పోస్ట్ పంచుకున్నారు. తన పోస్ట్‌లో అపూర్వతో తన తొలి డేటింగ్ స్టోరీని షేర్ చేశారు. రెండు ఫోటోలను పోస్ట్ చేశారు, ఇందులో ఒకటి మొదటి…
India on Trump: ఆపరేషన్ సిందూర్‌తో భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల ఏర్పాడ్డాయి. భారత దాడితో పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చి కాల్పుల విరమణ ప్రతిపాదన చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే, రెండు దేశాల మధ్య తానే మధ్యవర్తిత్వం వహించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీని తర్వాత, ఆయన మరో వింత వాదన చేశారు.