అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఓ రిపోర్టర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవల్ కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోవాలంటూ ఫైరయ్యారు. ఆ రిపోర్టర్‌ను ‘గెట్ అవుట్’ అన్నారు. దీంతో ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డీప్‌ఫేక్, రివెంజ్ పోర్న్‌లపై ఉక్కుపాదం మోపారు. వీటి కట్టడికి చట్టం చేశారు. ట్రంప్ బిల్లుపై సంతకం చేశారు. ఈ చట్టం పేరు టేక్ ఇట్ డౌన్ యాక్ట్. ఈ చట్టం అమల్లోకి వస్తే ఎవరైన వ్యక్తికి సంబంధించి ఆ వ్యక్తి అనుమతి లేకుండా AI జనరేటెడ్ అశ్లీల చిత్రాన్ని ఆన్లైన్లో పోస్ట్ చేస్తే, అప్పుడు టెక్నాలజీ కంపెనీలు 48 గంటల్లోపు ఆ కంటెంట్‌ను తొలగించాల్సి ఉంటుంది. మన పిల్లలు, మన కుటుంబాలు,…
భారతదేశం, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణలో తన పరిపాలనా వ్యవస్థ ముఖ్యమైన పాత్ర పోషించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. భారత్, పాకిస్థాన్ మధ్య అణు యుద్ధం లాంటి పరిస్థితిని నివారించడంలో అమెరికా పెద్ద దౌత్య విజయాన్ని సాధించిందని చెప్పారు. అయితే ఈ అంశంలో తనకు సరైన క్రెడిట్ ఇవ్వలేదని ట్రంప్ శనివారం ఓ ఇంటర్వ్యూలో అన్నారు.
S Jaishankar: ఆపరేషన్ సిందూర్, పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ గురించి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ రోజు మాట్లాడారు. కాల్పుల విరమణకు ఎవరు పిలుపునిచ్చారనే విషయం స్పష్టంగా ఉందని పాకిస్తాన్‌ని ఉద్దేశించి ఆయన అన్నారు. రెండు దేశాల మధ్య శాంతికి అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని డొనాల్డ్ ట్రంప్ చెప్పిన నేపథ్యంలో జైశంకర్ వ్యాఖ్యలు వచ్చాయి. ‘‘మేము పాకిస్తాన్ సైన్యంపై దాడి చేయలేదు. కాబట్టి పాక్ సైన్యం జోక్యం చేసుకోకుండా ఉండాలి. కానీ వారు ఆ…
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖతార్ పర్యటనలో ఉన్న ఆయన పలువురు వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆపిల్ సీఈఓ టిమ్ కుక్‌తో మాట్లాడుతూ.. ‘‘భారతదేశంలో ఆపిల్ కంపెనీ పెట్టాల్సిన అవసరం లేదు. మీరు భారతదేశంలో నిర్మించడం ఇష్టం లేదు’’ అని అన్నారు. ‘‘భారతదేశం తమను తాము చూసుకోగలదు. వారు బాగా పనిచేస్తున్నారు.’’ అని వ్యాఖ్యానించారు.
ఇండియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెత్తనమేంటి..? అని మండిపడ్డారు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా.. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆయన.. తిరుపతిలో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతదేశం సురక్షితంగా లేదు.. అంటూ ఆందోళన వ్యక్తం చేశారు..
Qatar PM: ఖతార్ నుండి అమెరికాకు ఇచ్చే లగ్జరీ జెట్ విమానం బహుమతి వివాదంపై ఆ దేశ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ బిన్ జాసిమ్ అల్-థానీ స్పందించారు. ఇది వ్యక్తిగతంగా ట్రంప్‌కు ఇచ్చే బహుమతిగా కాకుండా, ప్రభుత్వ స్థాయిలో జరిగిన లావాదేవిగా ఆయన స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల మిడిల్ ఈస్ట్ పర్యటనలో భాగంగా ఖతార్‌కి వెళ్లారు. ఈ సందర్భంగా ఖతార్ అమెరికాకు లగ్జరీ విమానం అందించనున్నట్లు వార్తలు…
Pakistan: ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది. చివరకు అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్ ‘‘కాల్పుల విరమణ’’కు అంగీకరించింది. ఇదిలా ఉంటే, ఇంత నష్టపోయిన పాకిస్తాన్‌కి బుద్ధి రావడం లేదు. ఆ దేశ రాజకీయ నాయకులు ఇంకా యుద్ధ భాష మాట్లాడుతూనే ఉన్నారు. తాజాగా, పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న ఇషాక్ దార్ మరోసారి భారత్‌ని బెదిరించే ప్రయత్నం చేశారు.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఖతార్ రాజ కుటుంబం విలాసవంతమైన బోయింగ్ 747-8 జెట్‌ను బహుమతిగా ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ విమానం విలువ సుమారు 400 మిలియన్ డాలర్లు(దాదాపు 3,300 కోట్లు)గా అంచనా వేయబడింది. ఈ విమానం తాత్కాలికంగా ఎయిర్ ఫోర్స్ వన్‌గా ఉపయోగించబడే అవకాశం ఉంది. 2029లో ట్రంప్ అధ్యక్ష పదవీ కాలం ముగిసిన తర్వాత, ఈ విమానం ట్రంప్ అధ్యక్ష గ్రంథాలయ ఫౌండేషన్‌కు బహుమతిగా ఇవ్వబడనుంది. ఇక ఈ బహుమతి విషయాన్ని…
US – China Tariffs: అమెరికా, చైనా దేశాలు పరస్పర వాణిజ్య ఉత్పత్తులపై విధించిన సుంకాలను తాత్కాలికంగా తగ్గించేందుకు సంయుక్తంగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయం నేపథ్యంలో రాబోయే 90 రోజులపాటు ఇరు దేశాలు తమ సుంకాలను గణనీయంగా తగ్గించనున్నాయి. సమాచారం మేరకు, అమెరికా ప్రభుత్వం చైనా ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాన్ని ప్రస్తుత 145 శాతం నుండి ఏకంగా 30 శాతానికి తగ్గించనుంది. అదే విధంగా, చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై విధించిన సుంకాన్ని…