Donald Trump: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ట్రూత్ సోషల్ పోస్టులో ‘‘ఇప్పటికీ ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని అంతమొందించడానికి తాను చర్యలు తీసుకోను, అమెరికా ఖమేనీని హత్య చేయగలదని, కానీ ప్రస్తుతానికి అలా చేయడం లేదని’’ అని అన్నారు. ‘‘షరతులు లేకుండా లొంగిపోండి’’ అంటూ గట్టి హెచ్చరిక చేశారు.
Israel Iran War: మధ్యప్రాచ్యంలో యుద్ధ ఘర్షణ తీవ్రమవుతోంది. ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య ఘర్షణ వాతావరణం ప్రపంచ దేశాలను భయపెడుతోంది. ఇరాన్ అణు కార్యక్రమాలపై శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్ అణు శాస్త్రవేత్తలతో పాటు, ఇరాన్ మిలిటరీ టాప్ జనరల్స్‌ని హతమార్చింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెలికమ్యూనికేషన్ వ్యాపారంలోకి ప్రవేశించారు. ఆయన తాజా కంపెనీ ట్రంప్ మొబైల్ T1 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ అమెరికాలో ఉత్పత్తి అవుతుంది. వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం, ఆయన దేశీయ కస్టమర్ సపోర్ట్ సెంటర్‌ను కూడా ప్రారంభించారు. డోనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్ న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌లో ఈ కొత్త కంపెనీని ప్రారంభించారు. ట్రంప్‌కు చెందిన ఈ కంపెనీ అమెరికాలో ప్రధాన టెలికాం ఆపరేటర్‌గా పనిచేస్తుంది. ట్రంప్ టెలికాం…
=ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌కు ప్రధాన శత్రువు ట్రంపేనని.. ఆయనను చంపాలని టెహ్రాన్ కురుకుంటోందని తెలిపారు.
Israel Iran War: ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. శుక్రవారం, ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయిల్ ఇరాన్ వ్యాప్తంగా భారీ దాడులు నిర్వహించింది. ముఖ్యంగా, ఇరాన్ అణు కార్యక్రమాలు జరిగే చోట్లతో పాటు ఇరాన్ టాప్ మిలిటరీ జనరల్స్‌ని, అణు శాస్త్రవేత్తల్ని హతమార్చింది. దీనికి ప్రతిస్పందనగా ఇజ్రాయిల్ పైన ఇరాన్ వందలాది మిస్సైళ్లను ప్రయోగించింది.
Donald Trump: ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య దాడులు, ప్రతి దాడుల మధ్య మిడిల్ ఈస్ట్ సంక్షోభం ముదిరింది. శుక్రవారం ‘‘ఆపరేషన్ రైజింగ్ లయన్’’ పేరుతో ఇజ్రాయిల్, ఇరాన్ అణు కార్యక్రమాలపై విరుచుకుపడింది. ఇదే కాకుండా ఇరాన్ మిలిటరీ టాప్ జనరల్స్‌తో పాటు అణు శాస్త్రవేత్తలను హతమార్చింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్, ఇజ్రాయిల్ లోని ప్రధాన నగరాలైన జెరూసలెం, టెల్ అవీవ్, హైఫా నగరాలపై వందలాది క్షిపణులతో విరుచుకుపడింది.
Donald Trump: ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడుల గురించి తమకు ముందే సమాచారం ఉందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని చెప్పారు. ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ హుస్సేన్ సలామీతో సహా అనేక మంది మరణించినట్లు వెల్లడించారు. ఇరాన్ తిరిగి చర్చల టేబుల్‌పైకి వస్తుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు.
పశ్చిమాసియాలో మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు దిగింది. అయితే, ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదు.. దీనిపై ఆ దేశం చర్చలకు రావాల్సిందే.
Trump Gold Card: అగ్రరాజ్యం అమెరికాలో పౌరసత్వం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇటీవల డొనాల్డ్ ట్రంప్ గోల్డ్ కార్డు ఆఫర్ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న పెట్టుబడి వీసా ఈబీ-5 ప్లేస్ లో గోల్డ్ కార్డు తీసుకు వస్తున్నట్లు తెలిపారు. 5 మిలియన్ డాలర్లు (రూ.44 కోట్లు) చెల్లించిన వారికి నేరుగా యూఎస్ పౌరసత్వాన్ని అందజేయనున్నారు.
US Invited Pak Army Chief: భారత్, పాకిస్తాన్ విషయంలో మరోసారి తన వక్రబుద్దిని బయట పెట్టింది అగ్రరాజ్యం అమెరికా. తమకు ఇండియా మిత్ర దేశం అంటూనే.. వెనుక మాత్రం గోతులు తీసేందుకు భారీ ప్లాన్ వేసింది.