భారతదేశం ప్రతీకార చర్యతో పాకిస్థాన్ పూర్తిగా భయపడింది. మధ్యవర్తిత్వం కోసం అమెరికాను ఆశ్రయించింది. అమెరికా భారత్- పాక్ మధ్య మధ్యవర్తిత్వం వహించింది. పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించింది. భారత్-పాకిస్తాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.. "కాల్పుల విరమణకు భారత్-పాక్ అంగీకరించాయి.. భారత్-పాకిస్థాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించాం.. రాత్రంతా భారత్-పాకిస్థాన్లతో చర్చలు జరిగాయి.. రెండు దేశాలకు నా అభినందనలు.. తక్షణమే కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి." అని ట్రంప్ పేర్కొన్నారు.
భారత్, పాక్ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ఈ సమాచారాన్ని ఇచ్చారు. ఈ అంశంపై పాక్ మంత్రి స్పందించారు. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తక్షణ కాల్పుల విరమణను ధృవీకరించారు. భారతదేశం -పాకిస్థాన్ మధ్య కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేయాలనే నిర్ణయంపై ఇరు దేశాలు అంగీకరించాయి. “పాకిస్థాన్-భారత్ తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించాయి. పాకిస్థాన్ తన సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను రాజీ పడలేదు. దేశంలో శాంతి, భద్రత కోసం…
Donald Trump: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పాకిస్తాన్ భారత్‌పై వరసగా రెండో రోజు డ్రోన్ దాడులు చేసింది. సరిహద్దుల్లోని 20 నగరాలను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, వీటన్నింటిన భారత గగనతల రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా అడ్డుకుంది. తాజాగా, ఉద్రిక్తతలపై ట్రంప్ స్పందించినట్లు వైట్ హౌజ్ ప్రకటించింది. త్వరగా సమస్య ముగియాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. Read Also: Pak drone attacks: 20 నగరాలను లక్ష్యం చేసుకుని పాకిస్తాన్ తాజా డ్రోన్ దాడులు.. భారత్,…
గత నెలలో జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఘోరమైన దాడి తర్వాత బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం దాడి చేసింది. క్షిపణి దాడిలో కనీసం ఎనిమిది మంది మరణించారని పాకిస్తాన్ తెలిపింది. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపిన ఫిరంగి దాడుల్లో ముగ్గురు పౌరులు మరణించారని భారత సైన్యం తెలిపింది. Also Read:Rajnath Singh: ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడమే భారత్ లక్ష్యం.. ఈ…
అమెరికాలో సినీ పరిశ్రమ నష్టాల ఊబిలోకి వెళ్తోందని, అక్కడి స్టూడియోలు యునైటెడ్ స్టేట్స్ నుంచి ఇతర దేశాలకు తరలి వెళ్తున్నాయని అందువల్ల ఇతర దేశాలలో నిర్మించి USAలో విడుదలయ్యే సినిమాలపై 100శాతం ట్యాక్స్ విధిస్తూ వెంటనే అమలు జరిగేలా వాణిజ్య శాఖ, వాణిజ్య ప్రతినిధులకు ఆదేశాలు జారీ చేసాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. రంగంలోకి దిగిన అధికారులు అందుకు సంబందించిన చర్యలను ముమ్మరం చేసారు. Also Read : JR. NTR : మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవతారం మార్చారు. పోప్ అవతారంలో ఉన్న ఒక ఫొటోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. తనకు తాను పోప్‌గా ఊహించుకుంటూ ఒక చిత్రాన్ని పోస్ట్ చేశారు.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసిద్ధ ‘‘హార్వర్డ్ యూనివర్సిటీ’’కి బిగ్ షాక్ ఇచ్చాడు. హార్వర్డ్‌కి ‘‘పన్ను మినహాయింపు’’ హోదాని రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ‘‘క్యాంపస్ యాక్టివిజం’’పై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చాలా ఆగ్రహంతో ఉంది. గతంలో ఎన్నికల ప్రచారంలో కూడా ఈ క్యాంపస్ యాక్టవిజం, లెఫ్టిస్ట్ భావజాలంపై ట్రంప్ విరుచుకుపడ్డారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి వాటిపై ఉక్కుపాదం మోపుతానని చెప్పారు.
Putin: రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ‘‘ముందస్తు షరతులు లేకుండా’’ ఉక్రెయిన్‌తో చర్చలు తిరిగి ప్రారంభించడానికి రష్యా సిద్ధంగా ఉందని పుతిన్ చెప్పారు. అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్తో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ విషయాన్ని చెప్పినట్లు శుక్రవారం క్రెమ్లిన్ తెలిపింది.
Donald Trump : జమ్మూ కశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడిపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కష్టసమయంలో అందరూ భారత్ కు మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ ప్రకటించింది. ‘ట్రంప్ మోడీకి ఫోన్ చేసి మద్దతు ప్రకటించారు. ఉగ్రదాడిన తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి పాల్పడిన వారిని శిక్షించేందుకు భారత్ కు సంపూర్ణ…
Donald Trump : జమ్మూకశ్మీర్ లోని పెహల్గాం ఉగ్రదాడిపై ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది స్పందిస్తున్నారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. ‘పెహెల్గాంపై ఉగ్రదాడి నన్ను తీవ్రంగా కలచి వేసింది. 27 మంది ప్రాణాలు పోవడం పెను విషాదం. ఉగ్రదాడికి పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరించాలి. ఈ విషయంలో భారత్ కు అమెరికా అండగా ఉంటుంది. ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీకి,…