H-1B Visa Fee: ట్రంప్ H-1B చర్యలు భారత్ కన్నా అమెరికా ఆర్థిక వ్యవస్థపైనే ప్రభావం, ఎలాగంటే.?
- ట్రంప్ H-1B చర్యలతో భారతీయుల్లో ఆందోళన..
- ట్రంప్ నిర్ణయం భారత్ కన్నా అమెరికా ఆర్థిక వ్యవస్థకే భారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
H-1B Visa Fee: అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్, గత వారం H-1B వీసాలపై – $100,000(రూ. 88 లక్షలు) రుసుము విధించాలనే నిర్ణయంతో ఒక్కసారిగా భారతీయ టెక్కీలు ఉలిక్కిపడ్డారు. తమ అమెరికన్ డ్రీమ్స్‌కు ట్రంప్ చెక్ పెట్టారని భావించారు. కొత్త నిబంధనల ప్రకారం, అమెరికాలోకి ఎంట్రీ లభించదనే భయంతో చాలా మంది విదేశీ వర్కర్లు, ముఖ్యంగా భారతీయులు ఆందోళన చెందారు. అమెరికన్ టెక్ కంపెనీలు తమ H-1B వీసాలు కలిగిన ఉద్యోగులు అమెరికా విడిచి వెళ్లొద్దని, అలాగే అమెరికా వెలుపల ఉన్న వారు వెంటనే వచ్చేయాలని చెప్పాయి.
ఇంటా, బయట నుంచి వచ్చిన ఒత్తిళ్ల కారణంగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తన నిర్ణయాన్ని సవరించుకున్నట్లు తెలుస్తోంది. ఈ రుసుం ఒకేసారి కట్టాలని, ఇది కొత్త దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుందని వైట్ హౌజ్ వివరణ ఇచ్చింది. ట్రంప్ చర్య అమెరికా ఆర్థిక వ్యవస్థనే ఎక్కువగా ప్రభావితం చేస్తుందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అమెరికా టెక్ సంస్థలు విదేశాల నుండి, ముఖ్యంగా భారతదేశం నుండి ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, కోడర్‌లను నియమించుకోవడానికి H-1B, ఇలాంటి వీసాలపై ఎక్కువగా ఆధారపడతాయని నిపుణులు ఎత్తి చూపారు.
Also Read
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
Read Also: Special Focus on Rains: ఆరంభంలో ముఖం చాటేశాడు.. ఇప్పుడు వద్దంటున్నా కుమ్మేస్తున్నాడు
వీసాలను ఖఠినతరం చేస్తే, కంపెనీలు విదేశీ ప్రతిభను ఆకర్షించడం కష్టతరం అవుతుందని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ బెరెన్‌బర్గ్‌లో ఆర్థికవేత్త అయిన అటకాన్ బాకిస్కాన్ ది గార్డియన్‌తో మాట్లాడుతూ అన్నారు. ట్రంప్ చర్య అమెరికా ‘‘వృద్ధి వ్యతిరేక విధాన రూపకల్పన’’గా అభివర్ణించారు. బరెన్ బర్గ్ ఇటీవల అమెరికా వృద్ధిని 2 శాతం నుంచి 1.5 శాతానికి అంచనాలనున తగ్గించింది. ట్రంప్ తన వలస వ్యతిరేక విధానాలను మార్చుకోకుంటే మరింత ప్రభావం పడుతుందని బకిస్కాన్ హెచ్చరించారు. బ్రోకర్ XTB పరిశోధన డైరెక్టర్ కాథ్లీన్ బ్రూక్స్ మాట్లాడుతూ, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా, ఆపిల్, గూగుల్ వంటి సంస్థలు H-1B వీసాలపై అత్యధిక విదేశీ వర్కర్లను నియమించుకున్నట్లు కొన్ని సంస్థలు తెలిపారు.
H-1B వీసాలలో ఎక్కువ మంది భారతీయులు అమెరికాలో పనిచేస్తున్నారు. ఈ వీసాల్లో 70 శాతం భారతీయులే. టెక్ కంపెనీలతో పాటు వైద్య రంగంలో భారతీయులు కీలకంగా ఉన్నారు. ట్రంప్ నిర్ణయం వల్ల మొదట్లో ఇండియా షాక్ అనుభవించవచ్చు, కానీ అమెరికాతో పోలిస్తే తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..