DONALD TRUMP: ట్రంప్‌కు హఠాత్తుగా చైనాపై కోపం.. 100 శాతం టారిఫ్ ఎందుకు.?
- హఠాత్తుగా ట్రంప్‌కు చైనాపై కోపం..
- చైనా రేర్ ఎర్త్ ఖనిజాలపై ఆంక్షలే కారణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DONALD TRUMP: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హఠాత్తుగా చైనాపై 100 శాతం సుంకాలను విధించారు. అయితే, ఉన్నట్లుండి ట్రంప్‌కు చైనాపై ఎందుకంత కోసం వచ్చిందనేది ఆసక్తిగా మారింది. నవంబర్ 01 నుంచి చైనా నుంచి వచ్చే అన్ని వస్తువులపై 100 శాతం సుంకాన్ని విధిస్తూ ట్రంప్ నిర్నయం తీసుకున్నారు. రేర్-ఎర్త్ ఖనిజాలపై చైనా కొత్త నియంత్రణలను తీసుకువచ్చిన తర్వాత, అమెరికా నుంచి ఈ చర్య వచ్చింది.
రేర్ ఎర్త్ ఖనిజాలు సెమీ కండక్టర్లు, ఫైటర్ జెట్‌లు, ఇతర అధునాతన టెక్నాలజీలో ఉపయోగిస్తారు. వీటిపై ప్రపంచవ్యాప్తంగా చైనా గుత్తాధిపత్యం ఉంది. అయితే, సుంకాలపై ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్టులో, చైనా ‘‘అసాధారణంగా దూకుడు’’ వైఖనిని తీసుకుందని ఆయన ఆరోపించారు. చైనా చర్యలను ‘‘అంతర్జాతీయ వాణిజ్యంలో నైతిక అవమానం’’గా పిలిచారు. బీజింగ్ అదనపు చర్యలు తీసుకుంటే అదనపు సుంకాలు త్వరలో అమలులోకి వస్తాయని ట్రంప్ హెచ్చరించారు.
Also Read
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
- North Korea vs South Korea: సరిహద్దులో ఉద్రిక్తత.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
Read Also: West Bengal: బెంగాల్‌లో మరో వైద్య విద్యార్థినిపై అత్యాచారం.. క్యాంపస్ సమీపంలోనే దారుణం..
దక్షిణ కొరియాలో జరిగే APEC శిఖరాగ్ర సమావేశానికి ముందు చైనా ఉద్దేశపూర్వకంగా ఎగుమతి నియంత్రణలను విధిస్తోందని అమెరికా అధికారులు ఆరోపించారు. ఈ సమావేశ వేదికలో ట్రంప్, జిన్‌పింగ్ భేటీ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఇప్పుడు ఈ సమావేశం సందిగ్ధంలో పడింది. తాను జిన్‌పింగ్‌ను కలవడానికి ఎలాంటి కారణం లేదని ట్రంప్ అన్నారు.
చైనా రేర్ ఎర్త్ ఖనిజాలపై పరిమితులు విధించడం, నేరుగా అమెరికా పారిశ్రామిక, రక్షణ అవసరాలను దెబ్బతీస్తుంది. అమెరికా తన రేర్ ఎర్త్ అవసరాలపై ఎక్కువగా చైనాపై ఆధారపడి ఉంది. ఇప్పుడిప్పుడే, యూఎస్ తన దేశీయ సామర్థ్యాన్ని పెంపొందించుకునే ప్రయత్నంలో ఉంది. అమెరికాలో ఏకైక రేర్ ఎర్త్ ఉత్పత్తిదారుగా ఉన్న ఎంపీ మెటీరియల్స్‌లో 400 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టనుంది.
తాజావార్తలు
-
Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
-
Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
-
Varanasi Release Date: ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
-
Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?