ప్రపంచవ్యాప్తంగా మనుషుల్లో మధుమేహం వేగంగా పెరుగుతోంది. వృద్ధులతో పాటు యువతలో కూడా ఈ వ్యాధికి సంబంధించిన కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మధుమేహం నుంచి కొద్దికొద్దీగా బయటపడాలంటే.. మీ జీవనశైలిని మార్చుకోవాలి. అంతేకాకుండా ఆ వ్యాధిగ్రస్తులు తమ రక్తంలో చక్కెరను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
దంతాలను మంచిగా శుభ్రం చేస్తున్నారా..? దంతాలు ఎంత శుభ్రంగా ఉంటే నోరు, ఆరోగ్యం అంతే బాగుంటుంది. ఏదో పైన పైన బ్రష్ చేసి అయిపోయిందనుకుంటే వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కొందరు దంతాలు శుభ్రంగా ఉండటం కోసం పొద్దున, సాయంత్రం బ్రష్ చేస్తారు.
ఈరోజుల్లో నిద్రలేమి సమస్య ప్రజల్లో పెరిగిపోతోంది. దీంతో వారు అనేక వ్యాధులకు గురవుతున్నారు. మానసిక సమస్యల వల్ల లేదా రాత్రి ఆలస్యంగా నిద్రపోయే అలవాటు వల్ల నిద్రలేమి వస్తుందని తరచుగా నమ్ముతారు, అయితే శరీరంలో విటమిన్లు లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుందని మీకు తెలుసా.
హైదరాబాద్ కొండాపుర్ జిల్లా హాస్పిటల్ వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ డయాగ్నొస్టిక్ ద్వారా అందించే 134 పరీక్షలను వర్చువల్ మోడ్ లో మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. breaking news, latest news, telugu news, harish rao, doctors,
సాయంత్రం భట్టి విక్రమార్కకు వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్యులు. మరో 24 గంటలు భట్టి విక్రమార్కకు విశ్రాంతి అవసరం అని తెలిపారు. జ్వరం నార్మల్ గా ఉన్నప్పటికీ.. బాగా నీరసంగా ఉన్నారని డాక్టర్లు చెబుతున్నారు. ఈసీజీ, బిపి, బ్లడ్ టెస్ట్ లు కూడా నార్మల్ గా ఉన్నాయన్నారు. అయితే రేపు క్లినికల్ పరీక్షల తర్వాతే పాదయాత్ర పై నిర్ణయం తీసుకోనున్నట్లు భట్టి సంబంధీకులు చెబుతున్నారు.
ఎండల ప్రభావం ఆపరేషన్లు(సర్జరీ)పై పడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యవసర సర్జరీలే చేస్తున్నారు వైద్యులు. మరోవైపు ఎలక్టీవ్ సర్జరీలు నిలిపివేయాలని సర్క్యూలర్ కూడా జారీ అయింది. అయితే ఆపరేషన్ చేసే సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే.. బాడీ డీహైడ్రేషన్ గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు తెలుపుతున్నారు. అందుకే అత్యవసరం అయితేనే సర్జరీలు చేస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. అత్యవసరం కానివి వాయిదా వేయాల్సిన ఆపరేషన్లను ఆపి వేస్తున్నట్లు ఎన్టీవితో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ తెలిపారు.
మీరు తరచుగా తలనొప్పిని కలిగి ఉన్నట్లయితే, అది భయానకంగా ఉంటుంది. నొప్పి కొనసాగితే లేదా పునరావృతమైతే, ఇది బ్రెయిన్ ట్యూమర్ వంటి తీవ్రమైన సమస్య అని మీరు భావించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 9 ఏళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్ణయించింది.
మందు తాగేవారిలో ఎర్రటి దద్దుర్లతో ‘లిక్కర్ అలర్జీ’ అనే అరుదైన వ్యాధి సోకుతుందని చాలా మందికి ఇప్పటి వరకు తెలిసి ఉండదు.. కానీ, దాని గురించి తెలుసుకోవాల్సిన సమయం వచ్చేంది.. ఎందుకంటే మనదేశంలో లిక్కర్ అలర్జీని ఇటీవల తొలిసారి హైదరాబాద్లోనే గుర్తించారు.