New Delh: దేశంలో పెరుగుతోన్న మధుమేహం.. నాలుగేళ్లలో 44% పెరుగుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Delh: ఇవ్వాలా? రేపు ఎవరిని అడిగినా ఎలా ఉన్నావంటే.. ఏముంది కొంచెం షుగర్(మధుమేహం) పెరిగిందనో.. లేకపోతే తగ్గిందనో చెబుతున్న సంఘటనలు చూస్తున్నాం. దేశంలో రోజు రోజుకు మధుమేహం వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతోంది. మధుమేహం వయస్సులతో సంబంధం లేకుండా.. అన్ని వయస్సుల వారికి వస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో మధుమేహం పెరుగుతోందని ఐసీఎంఆర్ నిర్వహించిన సర్వేలో తేలింది. గడచిన నాలుగేళ్ల కాలంలో 44 శాతం పెరిగింది. దేశంలో 10 కోట్ల మందికంటే ఎక్కువ మందిలో మధుమేహం ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
Read also: Gangula Kamalakar: చెరువులో పడ్డ మంత్రి గంగుల కమలాకర్
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
దేశంలో డయాబెటిస్ బారినపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. 2019లో 70 మిలియన్ల మందితో పోలిస్తే ఇండియాలో ఇప్పుడు 101 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని యూకే మెడికల్ జర్నల్ లాన్సెట్ లో ప్రచురించిన ఐసీఎంఆర్ అధ్యయనం తెలిపింది. కొన్ని అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య స్థిరంగా ఉన్నప్పటికీ.. అనేక రాష్ట్రాల్లో అవి భయంకరమైన రేటుతో పెరుగుతున్నాయనీ, తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయనం పేర్కొంది. దేశంలో 136 మిలియన్ల మందికి అంటే జనాభాలో 15.3 శాతం మందికి ప్రీడయాబెటిస్ ఉందని తెలిపింది. డయాబెటిస్ అత్యధికంగా గోవాలో (26.4%), పుదుచ్చేరిలో (26.3%), కేరళలో (25.5%)గా ఉంది. అయితే జాతీయ డయాబెటిస్ సగటు 11.4 శాతం ఉంది. డయాబెటిస్ కేసుల వ్యాప్తి యూపీ, మధ్యప్రదేశ్ వంటి తక్కువగా ఉన్న రాష్ట్రాలతో పాటు బీహార్, అరుణాచల్ ప్రదేశ్ లో క్రమంగా పెరుగుతున్నారు.
Read also: Sharad Pawar: శరద్ పవార్, సుప్రియా సూలేలను చంపేస్తాం.. ట్విట్టర్లో హత్య బెదిరింపులు
గోవా, కేరళ, తమిళనాడు, చండీగఢ్‌లలో మధుమేహ కేసులతో పోలిస్తే ప్రీ-డయాబెటిస్ కేసులు తక్కువగా ఉన్నాయి. పుదుచ్చేరి, ఢిల్లీలలో దాదాపు సమానంగా ఉన్నాయి. మధుమేహం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ప్రీ-డయాబెటిస్ లో ఉన్నవారు అధికంగా ఉన్నారని మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ రంజిత్ మోహన్ అంజనా అన్నారు. యూపీలో డయాబెటిస్ ప్రాబల్యం 4.8 శాతంగా ఉందని… ఇది దేశంలోనే అత్యల్పమన్నారు. జాతీయ సగటు 18.15 శాతంతో పోలిస్తే 3 శాతం మంది డయాబెటిస్ వారు ఉన్నారు. యూపీలో డయాబెటిస్ ఉన్న ప్రతి వ్యక్తికి ప్రీ డయాబెటిస్ ఉన్నవారు దాదాపు నలుగురు ఉన్నారు. ప్రీ-డయాబెటిక్ అంటే సాధారణం కంటే ఎక్కువ రక్తంలో చక్కెర స్థాయి ఉన్న వ్యక్తి, కానీ టైప్ -2 డయాబెటిస్ గా పరిగణించేంత ఎక్కువగా లేదు. జీవనశైలిలో మార్పులు లేకుండా, పెద్దలు-ప్రీ డయాబెటిస్ ఉన్న పిల్లలకు డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యలు చెబుతున్నారు. డయాబెటిస్ మూలంగా రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం, ఊబకాయం వంటి ఇతర ప్రమాద కారకాలు ఉంటాయి. ఇది కార్డియాక్ అరెస్ట్, స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!