బీహార్ మాజీ సీఎం, ఆర్డేజీ చీఫ్ లాలూ కుమార్తె రోహిణి ఆచార్య తన నాన్నకు కిడ్నీ దానం చేసేందుకు ముందుకు వచ్చారు.. ఈ నెలలోనే కిడ్నీ మార్పిడి జరిగే అవకాశం ఉంది
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం రాత్రి నవజాత శిశువు మృతి చెందిన ఘటన ఆందోళనకు దారితీసింది. పెద్దపల్లి మండలం పాలితం గ్రామానికి చెందిన పవన్ కళ్యాణ్ వ్యక్తి భార్య దివ్యకు ప్రసవం దగ్గర పడడంతో రోజుల క్రితం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు.
వివాహితులు, అవివాతులునే వివక్ష లేకుండా దేశంలోని మహిళలందరూ 24 వారాల్లో అబార్షన్ చేసుకోవచ్చంటూ గురువారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. తాజాగా మైనర్ బాలికల విషయంలో కొన్ని కీలకాంశాలను స్పష్టం చేసింది.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో పవర్ కట్‌తో వైద్యులు, రోగులు ఇబ్బంది పడ్డారు. సుమారు గంటకుపైగా కరెంట్ రాలేదు. దీంతో వైద్యులు తమ మొబైల్ ఫోన్లలోని టార్చిలైట్ వెలుగులో రోగులకు చికిత్స అందించారు. బల్లియా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ సంఘటన జరిగింది. అక్కడ భారీ వర్షాలకు ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులు, రోగులు ఇబ్బంది పడ్డారు. గంటకుపైగా కరెంట్ రాలేదు. ఆసుపత్రిలోని జెనరేటర్ పని చేయలేదు. అత్యవసర లైట్లు…
జూనియర్ డాక్టర్లతో సేవ చేయించుకున్నారు. స్టైఫండ్ మాత్రం ఇవ్వలేదు. అడిగిన ప్రతిసారి రేపు, ఎల్లుండి అని దాట వేశారు. ఇప్పుడు వాళ్ల ఇంటర్నషిప్ కూడా పూర్తయిపోయింది. మరి మా స్టైఫండ్ సంగతి ఏమిటని ప్రశ్నిస్తే… ఇవ్వలేమంటూ చేతులెత్తేశారు అధికారులు. ఇంతకీ ఆదిలాబాద్ రిమ్స్‌లో ఏం జరుగుతోంది..? తెలంగాణలో ఎక్కడా లేని పరిస్థితి ఇక్కడే ఎందుకు ఎదురవుతోంది..? ఆదిలాబాద్ రిమ్స్‌లో జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ అంశం మళ్లీ మొదటికొచ్చింది. ఇంత కాలం ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేసిన…
రాజమండ్రిలోని ప్రకాష్‌నగర్‌లో ఉన్న సారథి ఆస్పత్రిలో పూజలు చేయడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఆసుపత్రి యజమాని పార్థసారధి ఆధ్వర్యంలో ఆస్పత్రి ఆవరణలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో డాక్టర్ సారధి భార్య చంద్రకళ భయాందోళనకు గురై పోలీసులను ఆశ్రయించారు. ఆస్పత్రి ఆవరణలో చేపట్టిన దశ మహా విద్య, ధూమావతి, ప్రత్యంగిర చినమస్త అనేవి తాంత్రిక పూజలు అని ఆమె ఆరోపించారు. అయితే ఈ పూజలపై ఆస్పత్రి యజమాని పార్థసారధిని వివరణ అడగ్గా.. ఇది సాధారణ పూజలేనని..…
ప్రభుత్వ వైద్యులకు తెలంగాణ ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. సాధారణంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యుల్లో ఎక్కువ మంది ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తుంటారు. అయితే ఇకపై ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయరాదంటూ మంగళవారం నాడు హెల్త్ సెక్రటరీ రిజ్వీ జీవో విడుదల విడుదల చేశారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరే ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేసేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వైద్యులు ప్రాక్టీస్ చేసుకోవచ్చని.. వారిపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని క్లారిటీ…
వైద్యులు అంటే దేవుడి తరువాత దేవుళ్ళు అంటారు.. దేవుడు ప్రాణం పోస్తే.. ఆ ప్రాణాన్ని చివరివరకు కాపాడేది వైద్యుడే. కానీ అలాంటి వైద్య వృత్తిలో ఉంది కొందరు డబ్బు కోసం పాకులాడుతున్నారు. డబ్బు వస్తే చాలు మనిషి ఉన్నా పోయిన పట్టించుకోవడంలేదు. ఆపరేషన్ పేరుతో పేషంట్ పుర్రెను తొలగించి.. చివరకు అతికించకుండానే డిశ్చార్జ్ చేసిన ఘటన వరంగల్ హాస్పిటల్ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ చెన్నారావు పేటకు చెందిన మల్లేశ్‌కు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో…