ఈ రోజు ఇండియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రసీమ టాలీవుడ్. అయితే అందుకు అనుగుణంగా మన హీరోలు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వెళుతున్నారా? అంటే లేదనే చెప్పాలి. ఒకప్పుడు చిత్రసీమలో కమిట్ మెంట్ కి ఎంతో ప్రాధాన్యం ఉండేది. ఇప్పుడది కాగడా పెట్టి వెతికినా కానరాదు. ఎవరికి వారు సక్సెస్ వెంట పరుగులు పెడుతూ అది ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోతున్నారు. సక్సెస్ లో ఉన్న వారిని కలుపుతూ క్రేజీ కాంబినేషన్ లు సెట్ చేసుకుని లాభ…
తెలుగు సినిమా ఇప్పుడు తన ఉనికిని ప్రపంచవ్యాప్తంగా చాటుతోంది. ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ సినిమానే అనే స్థాయిని దక్షిణాది సినిమా పూర్తిగా ఆక్రమించేసింది. దానికి అనుగుణంగా దక్షిణాది సినిమాలకు, తారలకు, దర్శకులకు క్రేజ్ పెరిగింది. అయితే ఈ పెరుగుడు అసలు నిర్మాత మనుగడకే ప్రమాదం తీసుకురానుందా!? అంటే యస్ అనే వినిపిస్తుంది. సినిమాకు సంబంధించి రాబడి అంటే ఒకప్పుడు కేవలం థియేట్రికల్ కలెక్షనే. రాను రాను ఆదాయ మార్గాలు పెరిగాయి. ఆడియో, వీడియో, డబ్బింగ్, డిజిటల్,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో మరోపక్క రాజకీయాలతో బిజీగా మారారు. ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలు లైన్లో ఉండగా.. మరో రెండు సినిమాలు వెయిటింగ్ లో ఉన్నాయి. వచ్చేహెనెలలో భీమ్లా నాయక్ విడుదలకు సిద్ధమవుతుండగా.. హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక ఇవి కాకుండా.. సురేంద్ర రెడ్డి సినిమా, మరో యంగ్ డైరెక్టర్ మూవీ లైన్లో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ డైరెక్టర్లందరికి పవన్…
ఏపీలో సినిమా టికెట్ ధరలు ఇటీవల కాలంలో టాలీవుడ్ లో హాట్ టాపిక్. ఇటీవల సవరించిన జీవోతో టాలీవుడ్ లో పెద్ద సినిమాల మనుగడకు పెద్ద ముప్పు ఏర్పడిందన్నది వాస్తవం. ఇలా అయితే ఇండస్ట్రీ మనుగడ కష్టమేనని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరికొంత మంది దీని వల్ల సినిమాల నిర్మాణ వ్యయం తగ్గి తద్వారా తారలు, సాంకేతిక నిపుణుల పారితోషికాలు కూడా తగ్గే అవకాశం ఉందంటున్నారు. అయితే ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలకు…