కెనడా పర్యటనకు వెళ్లిన భారతీయ దంపతులు.. వారి మూడు నెలల మనవడు సహా నలుగురు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. మద్యం మత్తులో రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేస్తున్న క్రమంలో.. ఈ ప్రమాదం జరిగిందని అక్కడి పోలీసులు చెబుతున్నారు. టొరంటోకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న విట్బీలోని హైవే 401లో నలుగురు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మరణించారని అంటారియో పోలీసులు గురువారం తెలిపారు.
Read Also: Chandrababu : పింఛన్ల పంపిణీపై సీఎస్ తీరు సరికాదు
మరోవైపు.. అదే కారులో ఉన్న మూడు నెలల పాప కూడా మరణించాడని పోలీసులు తెలిపారు. ఆ పిల్లవాడి తల్లిదండ్రులు కూడా అదే కారులో ఉన్నారు. కాగా.. గాయపడిన వారు ఆసుపత్రిలో చేరారని, తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకున్నాయి. ఆ కారణంగా కొన్ని గంటలపాటు రోడ్డు మూసివేశారు. ఈ ప్రమాదంలో దోపిడీ నిందితుడు కూడా మరణించినట్లు అక్కడి వార్తా సంస్థ తెలిపింది.
Read Also: AP Weather: రికార్డు స్థాయిలో 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత.. రేపు 58 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
ఈ ప్రమాదంలో.. మరో ప్రయాణీకుడికి తీవ్రంగా గాయాలయ్యాయి. అతన్ని వెంటకనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కాగా.. టొరంటోలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.