గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో తమ పేర్లను స్థానిక ఆలయ పండుగ కరపత్రంలో ప్రచురించకపోవడంపై రెండు గ్రూపుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో 80 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందింది. మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నగరంలోని వస్త్రాపూర్ ప్రాంతంలో బుధవారం రాత్రి ఒక వర్గం మరో వర్గంపై కర్రలు, రాళ్లతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Wittal: జింబాబ్వే మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. తీవ్ర గాయాలు
ఈ ఘర్షణ కరపత్రంపై పేరు వల్ల తలెత్తింది. స్థానిక ఆలయ ఉత్సవ కరపత్రంలో కొందరి పేర్లను చేర్చాలని ఓ వర్గం భావించింది. దీనిపై ఏర్పడిన విభేదాలు ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసిందని పోలీసులు తెలిపారు. ఇరువైపులా దాడులు చేసిన వారిని గుర్తించిన పోలీసులు.. 21 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వస్త్రాపూర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఎల్‌ఎల్ చావ్డా తెలిపారు. ఆలయ ఉత్సవం కోసం కరపత్రంపై పేర్లను ప్రచురించడంపై వస్త్రాపూర్ ప్రాంతానికి చెందిన రెండు గ్రూపులు ఘర్షణ పడి ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు.
Read Also: Gyanvapi: జ్ఞానవాపీ మసీదు సర్వేకి ఆదేశించిన జడ్జికి బెదిరింపు కాల్స్..
భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ల కింద నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో ఏడుగురిని గుర్తించారు. ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు హత్య, హత్యాయత్నం, అల్లర్లు, చట్టవిరుద్ధమైన సమావేశాలు, నిర్లక్ష్యంగా వ్యవహరించడం మరియు స్వచ్ఛందంగా గాయపరచడం వంటి అభియోగాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.