ఫేమస్ హాలీవుడ్ డైరెక్టర్స్, రూసో బ్రదర్స్ ఆంటోనీ, జో తెరకెక్కించిన సినిమా ‘ది గ్రే మ్యాన్’. ఈ నెల 22న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలవుతోంది. ఇందులో ర్యాన్ గోస్లింగ్ హీరో. క్రిస్ ఇవాన్స్, అనా డి ఆర్మాస్, ధనుష్ కీలక పాత్రల్లో నటించారు. అతి త్వరలో ముంబైలో ‘ది గ్రే మ్యాన్’ షో వేస్తున్నారు. ధనుష్ కోసం, భారతీయ ప్రేక్షకుల కోసం రూసో బ్రదర్స్ ఇండియా వస్తున్నారు. భారీ యాక్షన్ సినిమాలకు రూసో బ్రదర్స్ ఆంటోనీ,…
నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్, విలక్షణ దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ కలయికలో ఓ భారీ పీరియాడికల్ చిత్రం రూపొందనుంది. 1930-40 నేపధ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ కానుంది. సత్యజ్యోతి ఫిలింస్ పతాకంపై టి. జి. త్యాగరాజన్ సమర్పణలో సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘కెప్టెన్ మిల్లర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని జి. శరవణన్, సాయి సిద్ధార్థ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.…
టీనేజ్ బ్యూటీ కృతి శెట్టి ఏ ముహూర్తన హీరోయిన్గా అడుగుపెట్టిందో గానీ.. వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతోంది. తన క్యూట్‌నెస్‌తో కట్టిపడేస్తున్న ఈ బ్యూటీ.. తెలుగు, తమిళ్లో భారీ ఆఫర్స్ అందుకుంటోంది. తాజాగా కృతికి మరో కోలీవుడ్ స్టార్ హీరో సరసన ఛాన్స్ దక్కినట్టు తెలుస్తోంది. దాంతో కృతి అక్కడ సీనియర్ హీరోయిన్లకు చెక్ పెట్టేసిందని అంటున్నారు. ఇంతకీ కృతి ఏ స్టార్ హీరోతో రొమాన్స్ చేయబోతోంది..? ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోయిన్లలో కృతి శెట్టి టైం…
సోషల్ మీడియాలో కొందరు ఆకతాయిలు ఎలా హద్దు మీరి ప్రవర్తిస్తుంటారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ముఖ్యంగా హీరోయిన్లను టార్గెట్ చేస్తూ.. అసభ్యకరమైన పోస్టులు, ట్వీట్లు పెడుతుంటారు. తాము చేస్తోంది కరెక్టా, కాదా అనేది ఆలోచించరు.. ఏది తోస్తే అది చేసేస్తుంటారు. హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్, సినిమాల్లో చేసే ఇంటిమేట్ సీన్లపై అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేస్తుంటారు. అయితే.. కథానాయికలూ ఊరికే ఉండరులెండి, కొందరు అప్పటికప్పుడే ఘాటు రిప్లై ఇస్తూ ఆ ఆకతాయిల నోళ్ళు మూయించేస్తారు. తాజాగా మాళవిక…
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఒక్క కోలీవుడ్ లోనే కాదు అన్ని భాషల్లోనూ ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన హీరోల్లో ధనుష్ ఒకడు. కథ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల నటుడు. పాత్ర ఏదైనా ధనుష్ నటించాడు అనడం కన్నా జీవించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక రజినీకాంత్ అల్లుడిగా ఆయన స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ…
తమిళ స్టార్ హీరో ధనుష్ పేరు వినగానే, ఆయన విలక్షణమైన అభినయం ముందుగా గుర్తుకు వస్తుంది. ధనుష్ తండ్రి కార్తిక్ రాజా తమిళ చిత్రసీమలో పేరు మోసిన రచయిత, దర్శకుడు. అన్న సెల్వరాఘవన్ పేరున్న దర్శకుడు. ఆరంభంలో వారి నీడన నిలచిన ధనుష్ తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు అయ్యాడు. ఇవన్నీ ధనుష్ కు మొదటిరోజుల్లో కాసింత గుర్తింపు తేవడానికి పనికి వచ్చాయి. తరువాత అంతా ధనుష్ స్వయంకృషితో సాధించుకున్నదే. తమిళ, తెలుగు, మళయాళ చిత్రాల్లో…
మన తమిళ స్టార్ హీరో తనదైన అభినయంతో ఎల్లలు చెరిపేసుకుంటూ దూసుకుపోతున్నారు. తొలుత మాతృభాష తమిళంలోనూ, తరువాత అనువాద చిత్రాల ద్వారా తెలుగు, కన్నడ సీమల్లోనూ, ఆ పై మళయాళంలోనూ నటించి అలరించారు. తరువాత హిందీ చిత్రసీమలోనూ తనదైన బాణీ పలికించారు ధనుష్. ఇప్పుడు హాలీవుడ్ మూవీ ‘ద గ్రే మేన్’ అనే సినిమాతో జూలై 15న జనం ముందుకు రానున్నారు ధనుష్. ఈ మూవీ విడుదలైన వారానికే అంటే జూలై 22నే నెట్ ఫ్లిక్స్ లో…
18 ఏళ్ల క్రితం ‘ఆర్య’తో దర్శకుడు సుకుమార్‌ను లాంచ్ చేశాడు అగ్ర నిర్మాత దిల్ రాజు. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల వీరిద్దరూ కలిసి పని చేయలేదు. ఇప్పుడు 18 సంవత్సరాల తర్వాత దిల్ రాజు ఓ సినిమా కోసం చేతులు కలుపుతున్నారు. దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ ప్రధాన పాత్రలో రూపొందనున్న ఈ చిత్రానికి “సెల్ఫిష్” అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రం ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్‌లో అధికారికంగా ప్రారంభమైంది. Read Also…
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు డైరెక్ట్ తెలుగు మూవీకి రెడీ అవుతున్నారు. బాలీవుడ్, హాలీవుడ్ లోనూ సత్తా చాటడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆ భాషా ఈ భాషా అని కాకుండా అన్ని భాషల్లోనూ కనిపించడానికి భారీ స్కెచ్ వేశారు ధనుష్. ఈసారి పాన్ ఇండియా మూవీనే చేయబోతున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో ధనుష్ నెక్స్ట్ మూవీ కూడా పాన్ ఇండియా సినిమాగా…
పాన్ ఇండియా ఫీవర్ కారణంగా టాలీవుడ్ లో చిత్ర విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. చిన్న, మధ్య తరగతి హీరోలు సైతం తెలుగులో తీసిన సినిమాను ఇతర భాషల్లోనూ డబ్ చేసి, పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇక హీరోయిన్ ఓరియెంటెడ్ పాన్ ఇండియా చిత్రాలైతే చాలానే వరుస కట్టాయి. సమంత నటిస్తున్న ‘శాకుంతలం’, ‘యశోద’ రెండూ పాన్ ఇండియా మూవీసే. వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తున్న సినిమాలనూ పాన్ ఇండియా స్థాయిలో విడుదల…