Nene Vatunna Teaser: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధనుష్ తమిళ్ లో ఎంత ఫేమసో తెలుగులో కూడా అంతే ఫేమస్. ఆయన సినిమాలన్నీ తమిళ్ తో పాటు తెలుగులోనూ రిలీజ్ అవుతాయి. తాజాగా ధనుష్ నటించిన చిత్రం నేనే వస్తున్నా. శనుష్ అన్న సెల్వ రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇప్పటికే వీరి కాంబో హిట్ టాక్ తెచ్చుకొంది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకొన్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో ధనుష్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. హీరోగా, విలన్ గా ధనుష్ అదరగొట్టేశాడు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది.
హీరోగా, విలన్ గా రెండు పాత్రలో వేరియేషన్ చూపించాడు ధనుష్. పిల్లల కోసం హీరో ధనుష్.. అడవిలో వేటాడుతూ విలన్ ధనుష్ పోరాడుతున్న సన్నివేశాలు అదిరిపోయాయి. అసలు కథను రివీల్ చేయకుండా ఇద్దరు ధనుష్ ల పాత్రలు, వ్యక్తిత్వాలను చూపించడం ఆకట్టుకొంటుంది. ఇక విలన్ గా ధనుష్ ఆ ఈవిల్ నవ్వుతో, డ్యాన్స్ చేస్తున్న మూమెంట్స్ గూస్ బంప్స్ ను తెప్పిస్తున్నాయి. ఇక చివర్లో ఇద్దరు ధనుష్ ల మధ్య ఫైట్ మాత్రం థియేటర్ లో అరుపులే అన్న విషయం తెలుస్తోంది. కలై పులి ఎస్ థాను తను నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాను తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ రిలీజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట వైరల్ గా మారింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ధనుష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.