Thiru: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇటీవలే హాలీవుడ్ మూవీ గ్రే మ్యాన్ లో కనిపించి మెప్పించిన ధనుష్ తాజాగా నటిస్తున్న చిత్రం `తిరు చిత్రాంబళం`. మిత్రన్ ఆర్. జవహర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో తిరు పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ధనుష్ సరసన నిత్యా మీనన్, ప్రియా భవాని శంకర్, రాశీ ఖన్నా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. తిరు .. ఒక డెలివరీ బాయ్. నిత్యం డెలివరీలు ఇచ్చి రాత్రికి తాతతో కలిసి మందు కొట్టి పడుకుంటాడు. ఇక తిరు ను అందరూ పండు అని పిలుస్తుంటారు.
ఇక పండు జీవితంలోకి ముగ్గురు అమ్మాయిలు ప్రవేశిస్తారు. నిత్యా మీనన్ పండుకు చైల్డ్ హుడ్ ఫ్రెండ్. ఏ విషయాన్నీ అయినా పండు ఆమెతో పంచుకుంటాడు. ఇక లవర్ గా ప్రియా, రాశీ కనిపించారు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని లవ్ చేసి పెళ్లి చేసుకోమని నిత్యా మీనన్ చెప్పడం, పండు లవ్ కోసం తిప్పలు పాడడం వినోదాత్మకంగా చూపించారు. ఇక ట్విస్ట్ గా కొడుకు అంటే ఇష్టం లేని తండ్రి ప్రకాష్ రాజ్ పోలీస్ గా కనిపించాడు. చివరికి ఈ డెలివరీ బాయ్ కష్టాలు ఎందుకు వచ్చాయి..? ఈ ముగ్గురు అమ్మాయిలు తిరు లైఫ్ తో ఎలా ఆడుకున్నారు అనేది కథగా తెలుస్తోంది. ఇక ధనుష్ తాత గా భారతీ రాజా కనిపించారు. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే ఒక మిడిల్ క్లాస్ యువకుడి ప్రేమకథగా తెలుస్తోంది. అనిరుధ్ సంగీతం సినిమాకు హైలైట్ గా నిలవనుంది. ఈ చిత్రం ఆగస్టు 18 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ధనుష్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.