The Gray Man: ధనుష్ కోసం ఇండియా వస్తున్న రూసో బ్రదర్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫేమస్ హాలీవుడ్ డైరెక్టర్స్, రూసో బ్రదర్స్ ఆంటోనీ, జో తెరకెక్కించిన సినిమా ‘ది గ్రే మ్యాన్’. ఈ నెల 22న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలవుతోంది. ఇందులో ర్యాన్ గోస్లింగ్ హీరో. క్రిస్ ఇవాన్స్, అనా డి ఆర్మాస్, ధనుష్ కీలక పాత్రల్లో నటించారు. అతి త్వరలో ముంబైలో ‘ది గ్రే మ్యాన్’ షో వేస్తున్నారు. ధనుష్ కోసం, భారతీయ ప్రేక్షకుల కోసం రూసో బ్రదర్స్ ఇండియా వస్తున్నారు. భారీ యాక్షన్ సినిమాలకు రూసో బ్రదర్స్ ఆంటోనీ, జో ఫేమస్. హాలీవుడ్‌లో పలు హిట్ సినిమాలు తీశారు. నెట్‌ఫ్లిక్స్ కోసం రూపొందించిన ‘ది గ్రే మ్యాన్’ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదలవుతోంది.
Also Read
- Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
- Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
- Naga Vamsi: "నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు" సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
- Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
ఈ సందర్భంగా రూసో బ్రదర్స్ మాట్లాడుతూ ”మేం రూపొందించిన కొత్త సినిమా ‘ది గ్రే మ్యాన్’ ప్రదర్శనకు, మా స్నేహితుడు ధనుష్ ను చూసేందుకు ఇండియాకు వస్తుండటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. త్వరలో కలుద్దాం” అని అన్నారు. ‘ది గ్రే మ్యాన్’ సినిమా గురించి ధనుష్ మాట్లాడుతూ ”ఈ సినిమా జర్నీ ఒక రోలర్ కోస్టర్ రైడ్. యాక్షన్, డ్రామా, ఓ పెద్ద చేజ్… సినిమాలో అన్నీ ఉన్నాయి. గొప్ప గొప్ప వాళ్ళందరూ కలిసి చేసిన ‘ది గ్రే మ్యాన్’లో మంచి పాత్ర పోషించడం నాకు సంతోషంగా ఉంది” అని చెప్పారు. మార్క్ గ్రీన్ రాసిన ‘ది గ్రే మ్యాన్’ పుస్తకం ఆధారంగా అదే పేరుతో రూసో బ్రదర్స్ ఈ సినిమాను రూపొందించారు. సినిమాకు తగ్గట్టుగా జో రుసో, క్రిస్టోఫర్ మార్కస్, స్టీఫెన్ మెక్ ఫీల్ స్క్రిప్ట్ రాశారు.
తాజావార్తలు
-
Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
ట్రెండింగ్
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?