Dhanush: Sir’ poster release… !!
జాతీయ అవార్డు గ్రహీత ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం ‘సార్’. ఈ సినిమా తమిళంలో ‘వాతి’ పేరుతో తెరకెక్కుతోంది. షూటింగ్ ముగింపు దశలో ఉన్న ఈ సినిమాకు సాయి సౌజన్య సైతం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ మూవీ నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తోంది. చిత్ర కథానాయకుడు ధనుష్ పుట్టినరోజు (జూలై 28)ని పురస్కారించుకుని వేడుకలకు ఒక రోజు ముందే ‘సార్’ తొలి ప్రచార చిత్రాన్ని ఇవాళ విడుదల చేసింది చిత్రం యూనిట్. ఈ ప్రచార చిత్రం లో ధనుష్ ఓ లైబ్రరీలో కూర్చొని శ్రద్ధగా, దీక్షగా రాసుకుంటూ ఉన్నాడు. ఆయన ఇదంతా ఎందుకు చేస్తున్నారు, దేనికి సిద్ధ మవుతున్నారు లాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం వెండితెర మీద చూడాల్సిందే. ఈ ప్రచార చిత్రంతో సినిమా పట్ల పెరిగిన ఆసక్తి ని, మరో లెవెల్ కు తీసుకెళ్ళేలా రేపు సాయంత్రం 6 గంటలకు టీజర్ ను రిలీజ్ చేయబోతోంది ‘సార్’ టీమ్.
ఈ సందర్భంగా దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ, ”ఈ సినిమాలో ధనుష్ లెక్చరర్ గా కనిపిస్తారు. విద్యా వ్యవస్థ నేపధ్యంలో జరిగే కథ ఇది. ఇవాళ విడుదల చేసిన పోస్టర్, విడుదల కానున్న వీడియో సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంటాయి. తెలుగు, తమిళ భాషలలో ఏక కాలంలో రూపొందుతోంది చిత్రం. ధనుష్ అందిస్తున్న సహకారం, ఆయనతో ప్రయాణం మర్చిపోలేనివి” అని అన్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చుతుండగా, యువరాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
#Vaathi #Sir pic.twitter.com/2NAo1ayEv2
— Dhanush (@dhanushkraja) July 27, 2022