కోలీవుడ్ స్టార్ ధనుష్, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘వాతి’. తెలుగులో ‘సార్’ పేరుతో రూపొందుతున్న ఈ ద్విభాషా ప్రాజెక్ట్ ను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాతలు నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అవినీతిమయమైన విద్యావ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న సామాన్యుడి ప్రయాణాన్ని తెరపై చూపించనున్నారు. ఇందులో ధనుష్ కళాశాల ఉపాధ్యాయునిగా కనిపించనున్నాడు. ఇక ధనుష్ కు ఇదే మొదటి డైరెక్ట్ తెలుగు సినిమా. ఇప్పటికే మేకర్స్ విడుదల…
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇటీవల భార్య ఐశ్వర్య రజినీకాంత్ కి విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తమ మధ్య ఉన్న విబేధాల వలెనే తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నామని, దయచేసి తమ ప్రైవసీకి అడ్డుపడకండి అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ సమయంలో అభిమానులందరూ ధనుష్ కి అండగా నిలుస్తున్నారు. ఇక వీటితో పాటు ఇటీవల ధనుష్ కరోనా బారిన పడడం. చికిత్స తీసుకోవడం, ఈ విడాకుల గొడవ వీటన్నింటితో ధనుష్ సతమతమతమవుతున్నాడని తెలుస్తోంది. దీంతో…
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్- ఐశ్వర్య రజినీకాంత్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. 18 ఏళ్ల వివాహబంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇక తాజాగా వీరి విడాకులపై హీరో ధనుష్ తండ్రి కస్తూరి రాజా స్పందించారు. కొడుకు విడాకులపై మీ స్పందన ఏంటి అని అడుగగా వారిద్దరూ త్వరలోనే కలుస్తారు అని చెప్పి షాక్ ఇచ్చారు. మీడియా తో ఆయన మాట్లాడుతూ “ధనుష్- ఐశ్వర్య మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అందుకే వారు ఈ…
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో విడాకుల ఛాలెంజ్ నడుస్తుందా..? అంటే.. అలాగే ఉంది అంటున్నారు ప్రేక్షకులు. గతేడాది చివర్లో సమంత- నాగ చైతన్య విడాకులు ప్రకటించి షాక్ కి గురి చేశారు. ఆ తరువాత అమీర్ ఖాన్- కిరణ్ రావు జంట కూడా విడిపోయారు. ఇక ఈ ఏడాదైన ఎలాంటి చేదు వార్తలు వినకూడదు అనుకొనేలోపు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ బాంబ్ పేల్చాడు. 18 సంవత్సరాల తమ వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు చెప్పుకొచ్చాడు. 2004 లో…
విడాకులు తీసుకుంటున్న జాబితాలో మరో ప్రముఖ జంట చేరింది. తమిళ స్టార్ హీరో ధనుష్-ఐశ్వర్య రజనీకాంత్ దంపతులు తాము విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. 2004లో వీరి వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే వీరి విడాకులకు గల కారణాలు తెలియాల్సి ఉంది. గత 18 ఏళ్ల నుంచి స్నేహితులుగా, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా ఒకరినొకరం అర్థం చేసుకుని ప్రయాణం కొనసాగించామని… కానీ ఇప్పుడు వేర్వేరు దారుల్లో ప్రయాణించేందుకు సిద్ధమయ్యామని హీరో…
తమిళ స్టార్ ధనుష్ తొలి స్ట్రెయిట్ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాపై అధికారిక ప్రకటన ఇచ్చిన మేకర్స్ సినిమా టైటిల్ ను తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేశారు. “సార్” అనే ఈ ద్విభాషా చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ధనుష్ సరసన సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తోంది. Read Also : కొత్త లుక్ లో పవన్… వెకేషన్ పిక్ వైరల్…
తమిళ స్టార్ హీరో ధనుష్ ‘సార్’గా రాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక మోషన్ పోస్టర్ తో టైటిల్ ను రివీల్ చేశారు మేకర్స్. ఈ ద్విభాషా చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్నారు. తమిళంలో ‘వాతి’గా రూపొందుతున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం, నేపథ్య సంగీతం సమకూర్చనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించిన…
ఇటీవల కాలంలో ఇండియన్ స్ర్కీన్ పై బయోపిక్ ట్రెండ్ బాగా నడుస్తోంది. బడా బడా స్టార్స్ కూడా బయోగ్రాఫికల్ డ్రామాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ధనుష్ కన్ను కూడా ఈ బయోపిక్స్ పై పడింది. రెండు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న ధనుష్ ఇప్పటి వరకు ఎవరి బయోపిక్‌లో నటించ లేదు. అవకాశం లభిస్తే తను కూడా బయోపిక్‌లలో నటిస్తానంటున్నాడు ధనుష్. ఇటీవల తన సినిమా ‘అత్రంగి రే’ ప్రచారంలో భాగంగా మీడియా అడిగిన ప్రశ్నకు…
తమిళ స్టార్ హీరో ధనుష్ ఇప్పటికే బాలీవుడ్ లో ‘రాంఝనా’, ‘షమితాబ్’ చిత్రాలతో నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు. ధనుష్ తో ‘రాంఝానా’ మూవీ తెరకెక్కించిన ఆనంద్ ఎల్. రాయ్ తీసి తాజా చిత్రం ‘అత్రంగీ రే’. అక్షయ్ కుమార్, ధనుష్, సారా అలీఖాన్ నటించిన ఈ ముక్కోణ ప్రేమకథా చిత్రం ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. బీహార్ లోని శివాన్ కు చెందిన రింకు (సారా అలీఖాన్) పద్నాలుగేళ్ళ…
తమిళ స్టార్ హీరో ధనుష్ నెక్స్ట్ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. తాజాగా మోషన్ పోస్టర్ తో సినిమా టైటిల్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. ఆసక్తికరంగా సాగిన ఈ మోషన్ పోస్టర్ లో సినిమాకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు. ‘సార్’ అంటూ ఈ ద్విభాషా చిత్రానికి సంబంధించిన టైటిల్ ను రివీల్ చేయగా, దీనికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్నారు. Read Also : ‘వాతి’ అనే తమిళ టైటిల్‌తో రూపొందుతున్న ఈ…