ధనుష్ హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో కలైపులి ధాను నిర్మిస్తున్న ‘నానే వరువేన్’ సినిమా ఈ నెల 29 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తమిళంలో వి క్రియేషన్స్ పతాకంపై నిర్మితం అవుతున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ సొంతం చేసుకన్నారు. ఈ మేరకు ధాను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తెలుగు సినిమా టైటిల్ ను ‘నేనే వస్తున్నా’గా ఫిక్స్ చేసినట్లు రివీల్ చేశారు. ధనుష్ తో ఇల్లి ఆవ్రామ్ నటించిన ఈ సినిమాలో సెల్వరాఘవన్, ప్రభు, ఇందుజ రవిచంద్రన్, యోగిబాబు, షెల్లీ కిషోర్ ఇతర ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఇందులో ధనుష్ ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. 11 సంవత్సరాల తర్వాత ధనుష్, సెల్వరాఘవన్ కలసి చేస్తున్న సినిమా ఇది. దీనికి ధనుష్ కథను అందించటం విశేషం.
We are happy to announce that the Telugu right of #NaaneVaruvean for the entire Andhra Pradesh has been acquired by @GeethaArts ‘presents’ Neynay Vasthunnaa @dhanushkraja @selvaraghavan @thisisysr @omdop @theedittable @Rvijaimurugan @saregamasouth #NeynayVasthunnaa pic.twitter.com/LmMwyE97Ab
— Kalaippuli S Thanu (@theVcreations) September 14, 2022