Aamir Khan: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన కథలను ఎంచుకొని హిట్స్ అందుకోవడంలో ధనుష్ తరువాతే ఎవరైనా.. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అని లేకుండా అన్ని భాషల్లోనూ తన సత్తా చాటుతున్న ధనుష్ తాజాగా హాలీవుడ్ మూవీ ‘గ్రే మ్యాన్’ లో నటిస్తున్నాడు. ప్రముఖ హాలీవుడ్ దర్శకులు రూసో బ్రదర్స్ ఆంటోనీ రుసో జోయ్ రుసో ద్వయం తెరకెక్కించిన ఈ సినిమా జూలై 22 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో చిత్రబృందం ప్రమోషన్స్ షురూ చేశారు మేకర్స్. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కోసం మొట్టమొదటి సారి రూసో బ్రదర్స్ ఇండియా వచ్చారు.
ఇక నేడు ముంబై వచ్చిన ఈ అన్నదమ్ములకు.. బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ ఆతిథ్యం అందించారు. స్వయంగా వారిని ఇంటికి పిలిచి స్పెషల్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీలో హీరో ధనుష్ తో పాటు అమీర్ మాజీ భార్య కిరణ్ రావు కూడా సందడి చేశారు. ఈ జంట కొద్దీ నెలల క్రితం విడాకులు తీసుకొని విడిపోయిన విషయం విదితమే. అయినా పర్సనల్ గా తాము విడిపోయినా స్నేహితులుగా ఎప్పుడూ కలిసే ఉంటామని అమీర్ చెప్పుకొచ్చాడు. దీంతో ఆమె కూడా ఈ పార్టీలో కనిపించినట్లు టాక్.. ఇక వీరికి ప్రత్యేకంగా అమీర్ గుజరాతీ వంటకాలను రుచి చూపించాడట. ప్రస్తుతం ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.