Ayodhya : నేటి నుంచి సామాన్యులకు బాలరాముడి దర్శనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya : దేశవ్యాప్తంగా కోట్లాది మంది రామభక్తులు బాలరాముడిని చూసేందుకు ఎదురుచూస్తున్నారు. నేటి నుంచి సామాన్య భక్తులకు శ్రీరాముడి దర్శన భాగ్యం కలుగుతుందని ప్రధాన అర్చకులు ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అయోధ్యలో బాలరాముడి దర్శనం, హారతి సమయాల వివరాలను వారి వెబ్‌సైట్‌లో వెల్లడించింది. ఉదయం 7 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శన సమయం ఉంటుందని ప్రకటించారు. ఉదయం 6.30కి జాగరణ హారతికి ఒక రోజు ముందుగా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి. రాత్రి 7.30 గంటల సంధ్యా హారతికి అదే రోజు బుకింగ్చేసుకున్నా సరిపోతుందని తెలిపింది. శ్రీరాముని దర్శనం కావాలనుకునే భక్తులు తప్పనిసరిగా ఆధార్ కార్డు వంటి ఏదైనా గుర్తింపు పత్రాన్ని తప్పనిసరిగా తీసుకెళ్లాలి. హారతి కార్యక్రమానికి ఉచిత పాస్ ఇస్తారు.
Read Also:IND vs ENG: తెలుగు అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. తొలి రెండు టెస్టులకు విరాట్ కోహ్లీ దూరం!
Also Read
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
ఆన్‌లైన్ బుకింగ్ ఇలా..
బాలరాముని దర్శనం, హారతి పాస్‌ల ఆన్‌లైన్ బుకింగ్ కోసం భక్తులు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. మీరు మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ చేసి, OTPని నమోదు చేసి ధృవీకరించినట్లయితే, రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. లాగిన్ అయిన తర్వాత.. ‘మై ప్రొఫైల్’ విభాగంలోకి వెళ్లి గుర్తింపు వివరాలను నమోదు చేయండి. ఆ తర్వాత హారతి/దర్శన సమయ స్లాట్‌లను ఎంచుకుని.. పాస్ కోసం బుక్ చేసుకోండి.
Read Also: China : చైనాలో కొండచరియలు విరిగిపడి.. 8 మంది మృతి, 39 మంది గల్లంతు
ఎలా చేరుకోవాలి
అయోధ్య రామమందిరానికి చేరుకోవడానికి దేశంలోని ప్రధాన నగరాల నుండి రైలు, రోడ్డు, విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీ, లక్నో, వారణాసి, కోల్‌కతా నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. అక్కడి నుంచి అయోధ్య రామమందిరానికి వెళ్లేందుకు ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. అయోధ్య మహర్షి వాల్మీకి విమానాశ్రయం ఇటీవల అందుబాటులోకి వచ్చింది.
తాజావార్తలు
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!