భక్తులు సౌకర్యార్ధం బ్యాటరీతో నడిచే ఉచిత ధర్మరథాలను ప్రారంభించారు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. పర్యావరణ పరిరక్షణ కోసం తిరుమలలో అనేక చర్యలు తీసుకుంటున్నాం. ప్లాస్టిక్ నిషేధంతో పాటు టిటిడి,ఆర్టిసి వాహనాలను బ్యాటరితో నడిపేవి అంచెలు వారిగా అందుభాటులోకి తీసుకువస్తున్నాం. 18 కోట్లు విలువ చేసే 10 ధర్మరథాలను మెగా ఇంజనీరింగ్ సంస్థ ఉచితంగా అందజేసింది అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వ్యాఖ్యలపై టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్పందించారు. విమర్శలు చేయడానికే వీఐపీలు తిరుమలకు వస్తే ఏమీ చేయలేం. ఆ ఎమ్మెల్యే 28 మందిని తీసుకొచ్చారు.అందరికీ ప్రోటోకాల్ ఇవ్వాలంటే కుదరదు..అయినప్పటికీ 18 మందికి ప్రోటోకాల్ కేటాయించారు.. వీఐపీలకు నిబంధనల ప్రకారం అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం అన్నారు. ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగా టీటీడీపై విమర్శలు చేస్తే ఏమీ చేయలేం అన్నారు వైవీ సుబ్బారెడ్డి.
Read Also: Medchal : బావిలో సెక్యూరిటీగార్డ్ మృతదేహం.. చంపిందెవరంటే?
ఇదిలా ఉంటే ….తిరుమలలో దర్శనం సందర్భంగా తనకు గౌరవం లేదని ఎమ్మెల్యే అన్నా రాంబాబు టీటీడీపై మండిపడ్డారు. నీ వాళ్ళకు, నీ చుట్టాలకు ఒక చట్టం.. ఇతరులకో చట్టమా..?” -టీటీడీ మీ ఎస్టేట్ అనుకున్నారా..? -సిఎంవో సిఫారసును కాదంటారా..? ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానన్నారు. టీటీడీ ఈఓ ఒంటెత్తు పోకడపై గిద్దలూరు ఎమ్యెల్యే అన్నా రాంబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి దర్శనాలు, సౌకర్యాల కల్పనలో ప్రోటోకాల్ ప్రక్రియను టిటిడి ఈఓ ,ఇతర అధికారులు దుర్వినియోగం చేస్తున్నారంటూ గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆదివారం ఆరోపించారు.. ఒంటెత్తు పోకడతో,తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. ఇటు టిటిడికి,అటు ప్రభుత్వ పెద్దలకు చెడ్డ పేరు తెచ్చేందుకు పని చేస్తున్నారని టిటిడి ఈఓ ధర్మారెడ్డిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే.
తిరుమలలో మాట్లాడుతూ సామాన్య భక్తులకు సౌకర్యాలు చేపడ్తున్నామనే వంకతో ప్రోటోకాల్ విషయంలో తన ఇష్టారాజ్యంగా వ్యవహరించడమేమిటని ప్రశ్నించారు.సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పించడాన్ని తాము స్వాగతిస్తామన్నారు. ఏ నిబంధననైనా, ఏ కార్యక్రమమైనా తిరుమలలో పారదర్శకంగా జరిగితే సంతోషిస్తాం..స్వాగతిస్తామన్నారు. కానీ తిరుమలలో అలా జరగటం లేదని తన అసహనం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ దర్శనాలు, సౌకర్యాల విషయంలో ఈఓ తన వారిని ఒక రకంగా,ఇతరులను ఇంకో రకంగా,అవమానకరంగా చూడటమేమిటని నిలదీశారు అన్నా రాంబాబు.
Read Also: Pawan Kalyan: అబ్బాయ్ పై బాబాయ్ ప్రేమ చూస్తుంటే భలే ముచ్చటేస్తుందే