Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఇవాళ (శుక్రవారం) తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. లిక్కర్ స్కామ్ కేసులో తనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేయడాన్ని కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ పిటిషన్ ఫైల్ చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం మే 17వ తేదీన తీర్పును రిజర్వ్ చేసింది. అయితే, మార్చి 21వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. ఈడీ కేసులో జూన్ 20న ట్రయల్ కోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు జారీ చేసింది. అయితే, ట్రయల్ కోర్టు ఉత్తర్వులను ఈడీ హైకోర్టులో సవాల్ చేసింది.. జూన్ 25వ తేదీన ఢిల్లీ హైకోర్టు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై స్టే ఇచ్చింది.
Read Also: Rohit Sharma Prize Money: రాహుల్ ద్రవిడ్ కంటే ముందే.. రూ.5 కోట్లు వదులుకునేందుకు సిద్దమైన రోహిత్!
అయితే, ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ డిప్యూటి సీఎం, మనీష్ సిసోదియా, మంత్రి సత్యేంద్ర జైన్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ 2021- 22లో రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ తీసుకు వచ్చారు. కానీ, ఈ పాలసీ ద్వారా కేజ్రీవాల్, ఇతర మంత్రులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఒక్కసారిగా రావడంతో ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు.