Fire Accident: దేశ రాజధాని ఢిల్లీలోని మయూర్ విహార్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన యూనిఫాం తయారీ దుకాణం, కేఫ్‌లలో జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడటంతో చుట్టు పక్కల దుకాణాలను చుట్టు ముట్టాయి. ఇక, స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించడంతో.. తమ వాహనాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 25 ఫైర్ ఇంజిన్ వాహనాలు మంటలను ఆర్పే పనిలో నిమగ్నమైయ్యాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు అని పేర్కొన్నారు. మంటల్లో చిక్కుకున్న ఒక వ్యక్తిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే సరికే మంటలు భవనంలోని మూడు అంతస్తులకు పూర్తిగా వ్యాపించాయి. వెంటిలేషన్ సరిగ్గా లేకపోవడం వల్లే మంటలు వ్యాపించాయని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించింది. ఈ కాంప్లెక్స్‌లో 30 దుకాణాలు ఉండగా.. వాటిలో దాదాపు 15కి పైగా దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి.
Read Also: VJ Sunny: సెలూన్ బిజినెస్‌లోకి బిగ్ బాస్ విన్నర్.. గ్రాండ్‌గా ఓపెనింగ్..
మరోవైపు చావడి బజార్ ప్రాంతంలో శనివారం అర్థరాత్రి గోదాం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో గోదాం పైకప్పుపై నిద్రిస్తున్న ఏడుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. అందరినీ లోక్ నాయక్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, ప్రస్తుతం ఐదుగురు కూలీలకు ప్రథమ చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. ఇద్దరు కూలీలకు తలకు, కాలికి గాయాలు కావడంతో.. వారి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది అని డాక్టర్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#WATCH दिल्ली: मयूर विहार फेज 2 में नीलम माता मंदिर के पास यूनिफॉर्म बनाने वाली दुकान और कैफे में आग लग गई। दमकल की गाड़ियां मौके पर मौजूद हैं। अधिक जानकारी का इंतजार है। pic.twitter.com/XGSNcdYJO0
— ANI_HindiNews (@AHindinews) July 14, 2024