ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. సీఎం హోదాలో తొలిసారి హస్తినకు వెళ్తున్నారు. రాష్ట్రానికి కీలక ప్రాజెక్టులు, నిధుల సమీకరణ, పెండింగ్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీఎం ఢిల్లీ టూర్ ఉండనుంది. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. రేపు ఉదయం 10 గంటలకు ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు.
Chandrababu Delhi Tour: ఢిల్లీ పర్యటనలో ప్రస్తావించాల్సిన అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.
AP CM: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు ( బుధవారం) ఢిల్లీ పర్యటన ఖరారైంది. ముఖ్యమంత్రి హోదాలో హస్తిన పర్యటనకు వెళ్తు్న్నారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసే ఛాన్స్ ఉంది.
CM Revanth Reddy: అధిష్టానం పిలుపు మేరకు నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పయనం కానున్నట్లు సమచారం. ఇవాళ సాయంత్రానికి కేబినెట్ విస్తరణ పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుందని తెలుస్తుంది.
Dating App Scams: ఇటీవల ఢిల్లీలో ఓ సివిల్ సర్వీస్ ఔత్సాహికడు డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన మహిళతో డేటింగ్ వెళ్తే ఓ కేఫ్‌లో రూ. 1.20 లక్షల బిల్లు చెల్లించాల్సి వచ్చింది. ‘టిండర్ స్కామ్’కి సంబంధించి ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
మద్యం పాలసీకి సంబంధించిన అవినీతి కేసులో ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. విచారణ సందర్భంగా.. కేజ్రీవాల్‌ను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరగా.. దానిని కోర్టు అంగీకరించింది.
Congress: తెలంగాణ పీసీసీ చీఫ్, మంత్రివర్గ విస్తరణ ఇంకా కొలిక్కి రాలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి అధిష్టానంతో భేటీ అయినప్పటికీ స్పష్టత రాలేదు. మరోసారి సోమవారం సమావేశం ఢిల్లీలో సమావేశం కావాలని నిర్ణయించారు.
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ (పీఎస్‌యూ)లకు రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో కేటాయించిన భూములను వెనక్కు తిరిగి ఇవ్వాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామిని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి శ్రీధర్ బాబు కేంద్ర మంత్రితో సమావేశమై పలు అంశాలను చర్చించారు.
దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి విచిత్రంగా మారింది. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్న చందాగా మారింది. నిన్నామొన్నటి దాకా తీవ్రమైన వేడి.. నీటి ఎద్దడితో అల్లాడిన ప్రజలకు రెండ్రోజుల ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. రెండ్రోజుల నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న తవర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి.