Delhi: ఢిల్లీలో కారు బీభత్సం.. 10 మీటర్లు ఈడ్చుకెళ్లడంతో యువకుడి మృతి
- ఢిల్లీలో కారు బీభత్సం
- 10 మీటర్లు లాక్కెళ్లడంతో యువకుడి మృతి
- నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో కారు ఓ వ్యక్తిని ఢీకొట్టి 10 మీటర్లు లాక్కెడంతో చనిపోయాడు. బుధవారం ఈ ఘటన జరిగింది. ప్రమాదం తర్వాత పారిపోయిన కారు డ్రైవర్‌ను మరుసటి రోజు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: RG Kar Hospital: కోల్‌కతా ఆర్‌జి కర్ ఆసుపత్రిపై మరో ఆరోపణ..వైద్యుల నిర్లక్ష్యంతో యువకుడు బలి?
Also Read
- BRICS 2026: మోదీ చేతుల్లో జిన్‌పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
- PM Modi - Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
- PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
- Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
మధ్యప్రదేశ్‌కు చెందిన దూబే బుధవారం కన్నాట్ ప్లేస్‌లో ఒకరిని కలవడానికి దక్షిణ ఢిల్లీలోని మహిపాల్‌పూర్‌లోని స్నేహితుడి నుంచి కారును తీసుకున్నాడని అధికారి తెలిపారు. మధ్యాహ్నం 3.25 గంటలకు తిరిగి వస్తుండగా కన్నాట్ ప్లేస్ ఔటర్ సర్కిల్ దగ్గర బరాఖంబా రేడియల్ రోడ్డు సమీపంలో రోడ్డు దాటుతున్న లేఖరాజ్ (45)ను కారు ఢీకొట్టింది. లేఖరాజ్ కారు చక్రాల కింద ఇరుక్కుపోయాడు. అయితే దూబే కారు ఆపకుండా నడుపుతూనే ఉన్నాడని అధికారి తెలిపారు. సుమారు 10 మీటర్లు ఈడ్చుకెళ్లిన తర్వాత లేఖరాజ్‌ను రోడ్డుపై వదిలి దూబే అక్కడి నుంచి పారిపోయాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని అధికారి తెలిపారు.
ఇది కూడా చదవండి: Assam: 3 వారాల తర్వాత గ్యాంగ్‌రేప్ కేసులో నిందితుల అరెస్ట్
కన్నాట్ ప్లేస్ ప్రాంతం నుంచి పారిపోయిన తర్వాత.. దూబే తన స్నేహితుడికి కారును తిరిగి అప్పగించాడు. సీసీటీవీలను పరిశీలించి కారు యజమానిని గుర్తించారు. తదనంతరం దూబేని అరెస్టు చేసి భారతీయ న్యాయ సంహిత (BNS) సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. ప్రమాదానికి కారణమైన కారును కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తదుపరి విచారణలు కొనసాగుతున్నాయని వారు తెలిపారు.
ఇది కూడా చదవండి: Actor Darshan: జైల్లో టీవీ కోసం రిక్వెస్ట్.. అంగీకరించిన అధికారులు
తాజావార్తలు
-
BRICS 2026: మోదీ చేతుల్లో జిన్‌పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
-
PM Modi – Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్‌కు భారీ రద్దీ.. ట్రాఫిక్ పోలీసుల బిగ్ ప్లాన్
-
Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
-
Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!