Nirmala Sitharaman: ఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన 54వ జీఎస్టీ కౌన్సిల్ భేటీలో దీనిపై విస్తృతంగా చర్చ జరిగింది. హెల్త్, లైఫ్ ఇన్సురెన్స్ ప్రీమియంలపై జీఎస్టీని తగ్గించే అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తర్వాత కీలక ప్రకటన చేసే ఛాన్స్ కనిపిస్తుంది. వీటిపై ప్రస్తుతం 18 శాతం జీఎస్టీని కేంద్ర సర్కార్ విధించింది. దీనిని తగ్గించే విషయంపై జీఎస్టీ కౌన్సిల్‌లో ఏకాభిప్రాయం వచ్చింది.. అయితే తదుపరి భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Read Also: Minister Kollu Ravindra: సహాయక చర్యల్లో గాయపడిన కానిస్టేబుల్‌కు రూ.2 లక్షల ఆర్థిక సాయం
అయితే, కేంద్ర, రాష్ట్రాలకు చెందిన పన్ను అధికారులతో కూడిన ఫిట్‌మెంట్ కమిటీ ఈరోజు లైఫ్, హెల్త్, రీ ఇన్సురెన్స్ ప్రీమియంలపై జీఎస్టీని తగ్గిస్తే కలిగే లాభ నష్టాలను జీఎస్టీ కౌన్సిల్ ముందుకు తీసుకొచ్చింది. జీఎస్టీ తగ్గింపుపై ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ తదుపరి సమావేశంలో తుది నిర్ణయం వెలువడే ఛాన్స్ ఉందని సంబంధిత వర్గాల అధికారులు తెలిపారు. అలాగే, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో హెలికాప్టర్ సేవలపై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుందని సమాచారం.