Chandrababu Meets Nitin Gadkari: నితిన్ గడ్కరీతో సీఎం చంద్రబాబు భేటీ.. అమరావతికి అన్ని జిల్లాల నుంచి కనెక్టివిటీ..!
- ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
- కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ..
- ఈ భేటీలో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu Meets Nitin Gadkari: ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన రెండో రోజు కొనసాగుతోంది.. తొలిరోజు బిజీబిజీగా గడిపిన ఆయన.. ఈ రోజు కూడా వరుసగా కేంద్ర మంత్రులను కలవనున్నారు.. ఇవాళ మొదటగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఈ భేటీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు.. రాజధాని అమరావతికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కనెక్టివిటీ, అమరావతి – హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, అమరావతి – రాయలసీమ జిల్లాల కనెక్టివిటీ సహా రాష్ట్రంలోని పలు ఇతర జాతీయ రహదారుల గురించి చర్చించారు..
Read Also: Srinivasulu Whatsapp Story: కరీంనగర్ లో వాట్సాప్ గ్రూప్.. ట్రెండింగ్ అవుతున్న శ్రీనివాస్ అనే పేరు..
Also Read
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
ఇక, తొలిరోజు ఢిల్లీ పర్యటనలో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశమైన విషయం విదితమే.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఫలప్రదమైన సమావేశం జరిగింది అంటూ ట్విట్టర్‌లో పంచుకున్నారు చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు క్యాబినెట్ ఆమోదం తెలపడంపై కృతజ్ఞతలు తెలిపాను.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను వివరించాను .. ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రానికి అందిస్తున్న చేయూతకు ధన్యవాదాలు తెలిపాను.. అమరావతి రాజధాని నిర్మాణానికి మద్దతు అందిస్తున్నారు అంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు..
Read Also: Vinesh Phogat: కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన రెజ్లర్ వినేశ్ ఫొగాట్.. వీడియో వైరల్!
మరోవైపు.. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవతో సమావేశంపై కూడా ఎక్స్ లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో పోస్టు పెట్టారు.. డిసెంబర్‌లో వైజాగ్ రైల్వే జోన్‌కు శంకుస్థాపన చేస్తామని.. ఏపీలో రైల్వే శాఖ 73,743 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతోంది.. హౌరా- చెన్నై నాలుగు లైన్ల ప్రాజెక్టులో ఇది భాగం.. 73 రైల్వేస్టేషన్లో ఆధునికరిస్తారు.. మరిన్ని స్థానిక రైళ్లను నడుపుతారు.. రైల్వే శాఖ భాగస్వామ్యంతో ఏపీ ప్రభుత్వం పని చేయడానికి సిద్ధంగా ఉంది అంటూ ట్వీట్ చేసిన విషయం విదితమే.. ఇక, ఈ రోజు సాయంత్రం 4.30కి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశం అవుతారు.. ఇక, 5:45కి కేంద్ర పెట్రోలియం సహజ వనరుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీకానున్నారు.. రాత్రి 8 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశంకానున్నారు.. రాత్రి 11:15 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీకానున్నారు ఏపీ సీఎం చంద్రబాబు..
తాజావార్తలు
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!