AP CM Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. బుడమేరు వరదలపై నివేదిక తర్వాత తొలిసారి ప్రధానిని కలిశారు. వరద సాయం, రైల్వే జోన్ ఏర్పాటు, విశాఖ ఉక్కును స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం, అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధుల విధులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడటం, పోలవరం నిర్మాణానికి నిధులు విడుదలపై ప్రధానితో చంద్రబాబు చర్చిస్తున్నట్లు సమాచారం. రాజధాని అమరావతి నిర్మాణాన్ని రాష్ట్ర సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ఈ క్రమంలోనే అమరావతి నిర్మాణం కోసం బడ్జెట్ అందించాలని కోరనున్నట్లు తెలుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై కీలకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పోలవరం నిర్మాణం నిధులపై కొంత జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. పోలవరం నిర్మాణంలో నిధుల కొరత లేకుండా చూడాలని ప్రధానిని సీఎం చంద్రబాబు ప్రత్యేకం చర్చించే అవకాశం కనిపిస్తోంది.
Read Also: Andhra University: అమ్మాయిలను డ్యాన్సులు చేయాలంటూ ర్యాగింగ్.. 10 మంది సీనియర్ల సస్పెన్షన్
ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. సాయంత్రం 6:15కి రైల్వే, సమాచార ప్రసారాల శాఖల మంత్రి అశ్వని వైష్ణవ్‌తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. రాత్రికి లేదా రేపు ఉదయం 10:30కి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీకానున్నట్లు సమాచారం. రేపు ఉదయం 11:30కి రవాణా మంత్రి నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, హార్దీప్ సింగ్ పూరితో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.