Delhi Air Quality: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోయింది. దీపావళి పండుగకు ముందే ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇక, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలో బుధవారం గాలి నాణ్యత 230 కాగా, ఈరోజు(శుక్రవారం) ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 293గా నమోదు అయింది. గాలి కాలుష్య తీవ్రత తగ్గించేందుకు అధికారులు ఫాగింగ్ చేస్తున్నారు. మరో వైపు పెరుగుతున్న వాయు కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Read Also: IND vs NZ: రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 450 రన్స్ చేస్తుంది: ఆకాశ్
కాగా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కోసం కొత్త విధానాలు చేపట్టినట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు. ఢిల్లీలోని 13 ప్రాంతాలను పొల్యూషన్ హాట్‌స్పాట్స్‌గా గుర్తించినట్లు చెప్పుకొచ్చారు. వీటిని గ్రీన్ వార్ రూమ్ నుంచి కమాండ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీలో కాలుష్యం దృష్ట్యా ఇప్పటికే దీపావళి పండగ రోజు బాణాసంచా వాడకంపై సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి వరకు బాణాసంచా తయారీ, వినియోగం, అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Read Also: Annie master : జానీ మాస్టర్ కేసు విషయం విని షాక్ అయ్యాను..
ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) గణాంకాలు:
ఢిల్లీ మొత్తం (సగటు) 293
ఆనంద్ విహార్ 339
అలీపూర్ 304
బవానా 329
బురారీ 339
ద్వారకా సెక్టార్ 8 324
జహంగీర్‌పురి 354
ముండ్కా 375
నరేలా 312
పంజాబీ బాగ్ 312
రోహిణి 362
షాదీపూర్ 337
వివేక్ విహార్ 327