Air Pollution: ఢిల్లీలో క్షీణించిన వాయు కాలుష్యం.. దీపావళికి బాణాసంచా పేల్చడంపై నిషేదం..!
- ఢిల్లీలో ప్రమాదకరస్థాయి మించిపోతున్న వాయు కాలుష్యం..
- ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 221గా నమోదైనట్లు పేర్కొన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్..
- దీపావళి పండగకు బాణాసంచా పేల్చడంపై నిషేదం విధించిన ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air Pollution: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వాయు కాలుష్యం భారీగా పెరిగిపోయింది. దీపావళి పండుగకు ముందే గాలి నాణ్యత బాగా క్షీణించింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తక్కువగా ఉన్నట్లు కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. ఈరోజు (సోమవారం) ఉదయం 9 గంటల వరకు ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 221గా నమోదైనట్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పేర్కొనింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్‌సీఆర్‌లో ఘజియాబాద్‌లో 265, నోయిడాలో 243, గ్రేటర్ నోయిడాలో 228 సహా పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత పూర్తిగా పడిపోయిందని చెప్పుకొచ్చింది. ఇక, గురుగ్రామ్‌లో 169, ఫరీదాబాద్‌లో 177గా గాలి నాణ్యత క్షీణించినట్లు చెప్పింది. మరోవైపు దేశ రాజధానిలో ఇవాళ కనిష్ట ఉష్ణోగ్రత 18.6 డిగ్రీల సెల్సియస్‌గా ఉండగా.. గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే ఛాన్స్ ఉంది.
Read Also: Effect of Inflation : ఆకాశాన్నంటుతున్న బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, టమోటాల ధరలు
Also Read
- Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
- CJP: ‘‘శివాజీ పార్క్‌లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!
ఇక, గాలి నాణ్యత 447కు పడిపోవడం అంటే దాన్ని తీవ్ర వాయు కాలుష్యంగా పరిగణించవచ్చు అని ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రిసెర్చ్ నివేదికలో తేలింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 0-100 మధ్య ఉంటే కాలుష్యం లేనట్లు.. AQI 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉన్నట్లు అర్థం చేసుకోవాలి.. ఇక, AQI 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత పూర్తిగా క్షిణించినట్లు అర్థం. అలాగే, AQI 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత దారుణంగా పడిపోయిందని.. AQI 400-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని.. కాగా, ఈ మధ్య ఢిల్లీలో గాలి కాలుష్యం ఆందోళనకరంగా మారిపోతుంది. ఢిల్లీలో గాలి కాలుష్యం పెరిగిపోవడంతో దీపావళికి టాపాకులపై నిషేదం విధించింది అక్కడి ప్రభుత్వం.
Delhi Pollution Control Committee issues an order for a complete ban on all kinds of firecrackers on manufacturing, storage and selling including delivery through online marketing platforms and bursting of all kinds of firecrackers upto 01.01.2025 in the territory of NCT of… pic.twitter.com/wpz1KQt7QG
— ANI (@ANI) October 14, 2024
తాజావార్తలు
-
IND vs WI 2nd ODI: టీమిండియా బౌలర్లకు ఎగిరి గంతేసే వార్త.. రెండో వన్డే నుంచి విండీస్ సెంచరీ హీరో ఔట్!
-
APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
ట్రెండింగ్
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?