Dating Fraud: డేటింగ్ మోసాలు పెరిగాయి. అమ్మాయిలు వలపువలలో పలువురు చిక్కుకుంటున్నారు. తాజాగా యూపీ ఘజియాబాద్‌లో డేటింగ్ ఫ్రాడ్ వెలుగులోకి వచ్చింది. అక్టోబర్ 21న ఢిల్లీకి చెందిన వ్యక్తికి ఘజియాబాద్ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అవతల నుంచి అమ్మాయి కావడంతో వీరిద్దరి మధ్య రొమాంటిక్ రిలేషన్ ప్రారంభమైంది. ఓ ఫైన్ డే డేట్‌కి అమ్మాయి ఆఫర్ ఇవ్వడంతో మనోడు ఎగరేసుకుని వెళ్లాడు.
అయితే, అమ్మాయి ఉచ్చులో చిక్కుకుంటానని సదరు వ్యక్తికి మాత్రం తెలియాదు. కౌశాంబి మెట్రో స్టేషన్‌లో కలుసుకుందామని మొదట ఇద్దరూ అనుకున్నారు. ఆ తర్వాత సదరు అమ్మాయి కౌశాంబిలోని ఓ హోటల్‌లోని మొదటి అంతస్తులో ఉన్న టైగర్ కేఫ్‌కి తీసుకెళ్లింది. అయితే, ఆ కేఫ్‌ని చూడగానే వ్యక్తికి అనుమానం వచ్చింది. దీనికి ఆన్‌లైన్‌లో దీని గురించి లేకపోవడం, సైన్ బోర్డు కూడా లేకపోవడంతో అనుమానించిన వ్యక్తి తన ఫ్రెండ్‌కి లొకేషన్ షేర్ చేశాడు.
Read Also: Naga Vamsi: లక్కీ భాస్కర్ కి అదే రిపీట్ చేస్తున్న నాగవంశీ
తీరా, అమ్మాయి ఒక కూల్ డ్రింక్ ఆర్డర్ చేసింది. బిల్లు కట్టే సమయంలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అమ్మాయి ఆర్డర్ చేసిన ఒక గ్లాస్ కూల్‌డ్రింక్ ధర రూ. 16,400. దీనిపై అభ్యంతరం చెప్పడంతో అక్కడ ఉన్న సిబ్బంది. అతడిని బలవంతంగా అడ్డుకుని రూ. 50,000 డిమాండ్ చేశారు. అతని స్నేహితుడికి మొత్తం విషయం చెప్పడంతో అతను పోలీసులకు ఫోన్ చేసి ఘటన గురించి వివరించాడు. దీంతో మొత్తం డేటింగ్ ఫ్రాడ్ వెలుగులోకి వచ్చింది.
ఈ గ్యాంగ్‌లో మొత్తం ఐదుగురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు. వీరంతా డేటింగ్ పేరులో యువకులను మోసం చేస్తున్నారు. ఈ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు అమ్మాయిలు ఢిల్లీకి చెందిన వారు. వీరంతా అన్ని డేటింగ్ యాప్‌లలో ప్రొఫైల్ కలిగి ఉన్నారు. వీరితో డేటింగ్ చేసే వారిని తరుచుగా టైగర్ కేఫ్‌కి పిలిపిస్తుంటారు. వీరి ఆర్డర్ చేసిన డ్రింక్స్ ధరలు వేలల్లో ఉంటాయి. చివరకి బిల్లు కట్టే సమయంలో తాము మోసపోయినట్లు గుర్తిస్తున్నారు. ఒక వేళ డబ్బు చెల్లించకపోతే, వారిపై దాడి చేయడం చేస్తుంటారు. మొత్తం 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తదుపరి విచారణ జరుగుతోంది. వీరి వలలో ఎంతమంది చిక్కుకున్నారనే వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.