Yamuna River: ఢిల్లీలోని కాళింది కుంజ్ ప్రాంతంలో యమునా నదిపై విషపు నురుగు తేలుతూ కనిపించింది. ఇది నదిలో పెరుగుతున్న కాలుష్యం ప్రమాదకర స్థాయిని చూపుతుంది. కార్తీక మాసం సందర్బంగా ఉదయం భక్తులు యమునా నదిలోకి దిగి సంప్రదాయ పూజలు చేసి పుణ్యస్నానాలు ఆచరించారు. కానీ నదిలో వ్యాపించిన నురుగు ఈ పండుగను ఆందోళనల మబ్బులో పడేసింది. తాజాగా డ్రోన్ నుండి తీసిన చిత్రాలు, వీడియోలలో ఉదయం 8 గంటల సమయంలో, నదిపై ముదురు తెల్లని నురుగు…
రెజ్లింగ్ అసోసియేషన్‌లో మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసుపై ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. విచారణ సమయంలో హాజరు కానందుకు బాధితురాలు సాక్షికి కోర్టు సమన్లు జారీ చేసింది. నవంబర్ 14 లోగా కోర్టులో సాక్ష్యాలను దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసులో గతంలో కూడా బాధితురాలికి సమన్లు జారీ చేశారు. ప్రస్తుతం ఆమె దేశంలో లేరని, అందుకే ఇక్కడికి రాలేనని బాధితురాలి తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. వచ్చే నెలలో జరిగే ఛాంపియన్‌షిప్‌కు…
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో టీడీపీ ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు భేటీ అయ్యారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్( NIPER) త్వరగా ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డాను కోరారు. నైపర్ సంస్థ గడచిన ఆరేళ్లుగా ఆగిపోయిందని.. దాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేసే విషయంపై ఎంపీ చర్చించారు.
India-China: వాస్తవాధీనరేఖ (ఎల్ఏసీ) వెంబడి బలగాల ఉపసంహరణలో భారత్, చైనాలు కొంత మేర పురోగతి సాధించాయని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. ఇది స్వాగతించ దగ్గ విషయం అన్నారు.
ఓ వ్యక్తి ట్రాఫిక్ పోలీసులకు కారుతో ఈడ్చుకళ్లాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు కారు బానెట్‌కు వేలాడుతూ ఉండడం, డ్రైవర్ వేగంగా కారు నడుపుతూ వారిని ఢీకొట్టేందుకు ప్రయత్నించడం వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటన శనివారం సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో జరిగింది. పోలీసులు ఎందుకో కారు ఆపాలని కోరారు.
గ్రేటర్ నోయిడాలో ఒక యువకుడు రెచ్చిపోయాడు. ఒక మహిళను పట్టుకుని ఇష్టానురీతిగా దిడి చేశాడు. జుట్టుపట్టుకుని చెంపలు వాయించాడు. ఆమె దుర్భాషలాడాడు. దీంతో ఆమె దెబ్బలు తాళలేక ఇబ్బందులు పడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పూర్నియా ఎంపీ పప్పూ యాదవ్‌ను చంపుతానని బెదిరించిన వ్యక్తిని ఢిల్లీలో అరెస్ట్ చేశారు. పూర్నియా పోలీస్ సూపరింటెండెంట్ కార్తికేయ శర్మ హాట్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయమై సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్తికేయ శర్మ పెద్ద సంచలన విషయాన్ని బయటపెట్టారు. గతంలో పప్పూ యాదవ్‌ను ఓ అపరిచిత వ్యక్తి బెదిరించగా.. ఆయన పోలీసులను ఆశ్రయించారు. వారు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీకి చెందిన మహేష్ పాండే అనే వ్యక్తిని అరెస్ట్…
దేశంలో రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. దీపావళి సందర్భంగా డబుల్ మర్డర్ సంఘటన మరువక ముందే.. మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. లైంగిక వేధింపులు ఎదిరించినందుకు ఏడేళ్ల బాలుడిని యువకుడు చంపేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 100 సీసీకెమెరాలను పరిశీలించి నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రముఖ భారతీయ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ (63) అంత్యక్రియులు ఢిల్లీలోని లోధీ రోడ్ శ్మశానవాటికలో ముగిశాయి. అంత్యక్రియలకు ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సునీల్ సేథీ, నటుడు అర్జున్ రాంపాల్, ఫ్యాషన్ డిజైనర్లలో ఒకరైన వరుణ్ బహల్, వరుణ్ బహ్ల్, రోహిత్ గాంధీ, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
భారత్‌లో గత కొద్ది రోజులుగా బాంబు బెదిరింపులు విమాన సంస్థలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ప్రతిరోజు డైలీ సీరియల్లాగా విమానాలకు బాంబు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. అయితే అక్టోబర్ 27న మాత్రం దుబాయ్ నుంచి ఢిల్లీ వచ్చిన ఎయిరిండియా విమానంలో మాత్రం బెల్లెట్లు కలకలం రేపాయి.