అమరావతి అభివృద్ధికి మరో ముందడుగు పడినట్టు అయ్యింది.. అమరావతి నిధుల ప్రతిపాదనపై ప్రంపచబ్యాంకు, ఏడీబీ, హడ్కో రుణాలపై ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది.. ప్రపంచ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు.. ఈ భేటీలో కేంద్ర, రాష్ట్ర అధికారులతో పాటు ప్రపంచబ్యాంకు, ఏడీబీ, హడ్కో బ్యాంకు అధికారులు పాల్గొన్నారు..
అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇప్పటి వరకు మీడియా సమావేశంలో చూపించిన ఆధారాలతో పాటు తన దగ్గర మరిన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. ఆ ఆధారాలను ఇవ్వడానికి కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ తీసుకున్నట్లు తెలిపారు.ఈ అమృత్ నిధులు కేంద్రం నుంచి వస్తాయని.. కాబట్టి కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు. ఈ మేరకు కేటీఆర్ ఢిల్లీకి బయలు దేరారు. అమృత్ టెండర్ల పై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కి ఫిర్యాదు…
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆదివారం పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో శుక్రవారం సుప్రీం ధర్మాసనం ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది. శుక్రవారం ఆయనకు చివరి పని దినం కావడంతో సర్వోన్నత న్యాయస్థానం ఘనంగా వీడ్కోలు తెలిపింది.
ఢిల్లీలోని ట్రూకాలర్ యాప్ కార్యాలయంలో ఆదాయపు పన్ను శాఖ విచారణ చేపట్టింది. ఆదాయపు పన్ను శాఖ ట్రూకాలర్ కార్యాలయం, దానికి సంబంధించిన క్యాంపస్లో సోదాలు నిర్వహించింది. కంపెనీ బదిలీ ధర నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపించింది. దీని కోసం ఆదాయపు పన్ను ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి. స్వీడన్ ఆధారిత ట్రూకాలర్ భారతదేశంతో సహా అనేక దేశాలలో బాగా ప్రాచుర్యం పొందింది.
Supreme Court: ప్రభుత్వ ఉద్యోగుల నియామకాల ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత.. ముందస్తుగా చెప్పకుండా రూల్స్ మార్చడానికి వీల్లేదని సుప్రీంకోర్టు బెంచ్ చెప్పింది.
Accused Arrest: రాజధాని ఢిల్లీ నగరంలో అక్టోబర్ 11 రాత్రి కాలే ఖాన్ ప్రాంతంలో రోడ్డు పక్కన రక్తంతో ఉన్న మహిళను కనుగొన్నారు పోలీసులు. ఈ స్థితిలో ఉన్న మహిళను చూసిన వెంటనే నేవీ సిబ్బంది ఆమెను ఎయిమ్స్ ట్రామా సెంటర్లో చేర్చారు. దీంతో సైనికులు పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదంపై పోలీసులు మహిళను విచారించేందుకు ప్రయత్నించగా, షాక్కు గురైన ఆమె ఏమీ సరిగ్గా చెప్పలేకపోయిందని తెలిపారు.…
కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణిస్తున్న నేపథ్యంలో పంట వ్యర్థాలను తగలబెట్టిన రైతులకు విధించే పెనాల్టీని రెట్టింపు చేసింది. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను దహనం చేసే రైతులకు రూ.30,000 వరకు జరిమానాను విధించేలా ఆదేశాలు జారీ చేసింది.
రేపు(బుధవారం) ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సాయంత్రం 6.30 గంటలకు ఆయన సమావేశం కానున్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ బుధవారం ఉదయం గన్నవరం ఎయిర్పోర్టు నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకుంటారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుస్తారు.
Yamuna River: ఢిల్లీలోని కాళింది కుంజ్ ప్రాంతంలో యమునా నదిపై విషపు నురుగు తేలుతూ కనిపించింది. ఇది నదిలో పెరుగుతున్న కాలుష్యం ప్రమాదకర స్థాయిని చూపుతుంది. కార్తీక మాసం సందర్బంగా ఉదయం భక్తులు యమునా నదిలోకి దిగి సంప్రదాయ పూజలు చేసి పుణ్యస్నానాలు ఆచరించారు. కానీ నదిలో వ్యాపించిన నురుగు ఈ పండుగను ఆందోళనల మబ్బులో పడేసింది. తాజాగా డ్రోన్ నుండి తీసిన చిత్రాలు, వీడియోలలో ఉదయం 8 గంటల సమయంలో, నదిపై ముదురు తెల్లని నురుగు…
రెజ్లింగ్ అసోసియేషన్లో మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసుపై ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. విచారణ సమయంలో హాజరు కానందుకు బాధితురాలు సాక్షికి కోర్టు సమన్లు జారీ చేసింది. నవంబర్ 14 లోగా కోర్టులో సాక్ష్యాలను దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసులో గతంలో కూడా బాధితురాలికి సమన్లు జారీ చేశారు. ప్రస్తుతం ఆమె దేశంలో లేరని, అందుకే ఇక్కడికి రాలేనని బాధితురాలి తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. వచ్చే నెలలో జరిగే ఛాంపియన్షిప్కు…