దేశ రాజధాని ఢిల్లీ సమీప ప్రాంతంలో ఏడేళ్ల వయసులో కిడ్నాపైన బాలుడు.. 30 ఏళ్ల తర్వాత ప్రత్యక్షమయ్యాడు. క్షేమంగా పోలీసులు ఇంటికి చేర్చారు. ప్రస్తుతం అతడి వయసు 37 ఏళ్లు.
ఇది కూడా చదవండి: Ajmer Sharif Dargah: “అజ్మీర్ షరీఫ్ దర్గా ఒక శివాలయం”.. విచారణకు అంగీకరించిన కోర్టు..
రాజు అనే బాలుడు, తన సోదరితో కలిసి పాఠశాల నుంచి ఇంటికి వెళ్తుండగా ఢిల్లీకి సమీపంలోనే ఘజియాబాద్‌లో సెప్టెంబర్ 8, 1993లో కిడ్నాప్‌నకు గురయ్యాడు. అనంతరం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. తాజాగా రాజస్థాన్ కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకుని వచ్చేశాడు. తనది ఏ నగరమో గుర్తింది.. అది మనసులో పెట్టుకుని ఢిల్లీ చేరుకున్నాడు. రాజధాని చేరుకున్నాక.. అనేక పోలీస్ స్టేషన్లు తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. చివరికి ఐదు రోజుల క్రితం ఘజియాబాద్‌లోని ఖోడా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. ఇక్కడి పోలీసులు అతడిని జాగ్రత్తగా చూసుకున్నారు. అతనికి బూట్లు ఇచ్చారు. అనంతరం ఆహారం, నీరు ఏర్పాటు చేశారు. మీడియా, సోషల్ మీడియాలో అతని గురించి సమాచారాన్ని ప్రచురించారు.
సమాచారం తెలుసుకున్న రాజు మామ పోలీసులను సంప్రదించాడు. అనంతరం అతని కుటుంబ సభ్యులు అతన్ని అక్కున చేర్చుకున్నారు. ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోందని సీనియర్ పోలీసు అధికారి రజనీష్ ఉపాధ్యాయ్ తెలిపారు.
కిడ్నాపర్లు తనను రాజస్థాన్‌కు తీసుకెళ్లారని.. ఇన్నాళ్లూ అక్కడే ఉన్నానని రాజు చెప్పాడు. ప్రతిరోజూ కొట్టేవారని.. పనులు చేయింపించుకునేవారిని చెప్పాడు. సాయంత్రం ఒక్క రోటీ మాత్రమే ఇచ్చారని వాపోయాడు. తప్పించుకునే మార్గం లేక బంధించారని వివరించారు. మొత్తానికి కిడ్నాపర్లు నుంచి తప్పించుకుని ట్రక్కు ఎక్కి ఢిల్లీ వచ్చినట్లు తెలిపాడు.
ఇది కూడా చదవండి: Kollywood : ఐశ్వర్య – ధనుష్ లకు విడాకులు మంజూరు చేసిన కోర్టు