వరి కోతలు ప్రారంభమైనా రైతులు, వ్యాపారులు ఆశించిన స్థాయిలో మార్కెట్ నడవడం లేదు. ఇజ్రాయెల్ - ఇరాన్‌లతో పాటు గాజాలో ప్రారంభమైన యుద్ధం మధ్య గల్ఫ్ లో గందరగోళం నెలకొంది. ఈ ప్రభావం ఆసియాలో అతిపెద్ద ధాన్యం మార్కెట్‌గా పిలువబడే నరేలా మార్కెట్‌పై కూడా ప్రభావం చూపుతోంది.
CRIME: ఢిల్లీకి చెందిన గర్భిణీ యువతిని అత్యంత దారుణంగా హత్య చేశాడు ఆమె లవర్. హర్యానలోని రోహ్తక్లో ఆమె ప్రియుడు, మరో ఇద్దరు కలిసి హత్య చేసి పూడ్చిపెట్టారు. పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఆమెను అబార్షన్ చేయించుకోవాలని ప్రియుడు ఒత్తిడి తెచ్చినప్పటికీ యువతి వినలేదు. దీంతోనే ఈ హత్యకు పాల్పడ్డాడు.
Dating Fraud: డేటింగ్ మోసాలు పెరిగాయి. అమ్మాయిలు వలపువలలో పలువురు చిక్కుకుంటున్నారు. తాజాగా యూపీ ఘజియాబాద్‌లో డేటింగ్ ఫ్రాడ్ వెలుగులోకి వచ్చింది. అక్టోబర్ 21న ఢిల్లీకి చెందిన వ్యక్తికి ఘజియాబాద్ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అవతల నుంచి అమ్మాయి కావడంతో వీరిద్దరి మధ్య రొమాంటిక్ రిలేషన్ ప్రారంభమైంది. ఓ ఫైన్ డే డేట్‌కి అమ్మాయి ఆఫర్ ఇవ్వడంతో మనోడు ఎగరేసుకుని వెళ్లాడు. అయితే, అమ్మాయి ఉచ్చులో చిక్కుకుంటానని సదరు వ్యక్తికి మాత్రం తెలియాదు. కౌశాంబి మెట్రో…
ప్రధాని మోడీతో జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జమ్మూకాశ్మీర్‌పై రాష్ట్ర కేబినెట్ చేసిన తీర్మానాన్ని ప్రధాని మోడీకి ఒమర్ అందజేశారు. జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం ఢిల్లీ వచ్చిన ఒమర్ అబ్దుల్లా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్ర హోదా తీర్మానాన్ని అందజేశారు.
కేంద్రమంత్రి జయంత్ సింగ్ కుమార్తె సాహిరా సింగ్ కూచిపూడి ప్రదర్శనతో అరంగేట్రం చేసింది. ఢిల్లీలోని కమానీ ఆడిటోరియంలో బుధవారం జరిగిన ప్రదర్శనతో ఎంట్రీ ఇచ్చింది.
ప్రధాని మోడీ రష్యా పర్యటన ముగిసింది. బ్రిక్స్ సదస్సు కోసం రెండ్రోజుల పర్యటన కోసం మోడీ రష్యా వెళ్లారు. రష్యాలోని కజాన్‌లో జరిగిన 16వ బ్రిక్స్ సదస్సులో మోడీ పాల్గొని దేశాధినేతలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఢిల్లీలో గాలి కాలుష్యం పెరుగుతుంది. ఈ క్రమంలో.. రెండవ దశ GRAP (గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్) అమలు చేశారు. సోమవారం సాయంత్రం సెంట్రల్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ ఏర్పాటు చేసిన గ్రేప్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. GRAP యొక్క రెండవ దశలో ఉన్న ఆంక్షలలో పార్కింగ్ రేట్లను పెంచడం, మెట్రో బస్సుల ఫ్రీక్వెన్సీని పెంచడం వంటి నిబంధనలు ఉన్నాయి.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ అయ్యారు. పలు ముఖ్యమైన అంశాలపై విజ్ఞప్తి చేశారు. నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్శిటీ క్యాంపస్‌లు వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటయ్యాయని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థను నెలకొల్పాలని కోరారు.